నటన అంటే కేవలం మొహంలో హావాభావాలు పలికించడమే కాదు. శరీరంలో ప్రతీ పార్టు అందుకు తగినంతగా స్పందించాలి.. అప్పుడే ఆ నటుడు ఆ పాత్రలో సరిగ్గా నటించగలుగుతాడు. అది తను చేస్తున్న పాత్ర కాదు తానే అలా చేస్తున్నాడేమో అన్నంత లెవెల్లో నటించడానికి నటుడికి అన్నీ సహకరించాలి. తన గొంతు కూడా నటించాలి. మాట పలికే తీరు కూడా నటనలో ఓ భాగమే..

 

డైలాగ్ చెప్పడమంటే కేవలం నోటి నుండి మాటలు బయటకి రావడం కాదు. అలా గొంతుతో కూడా నటించేవాళ్లలో ఎన్టీఆర్ ఒకరు. ఒక పర్ఫెక్ట్ యాక్టర్ అన్నింటినీ నమ్మిస్తాడు. ఎక్కడ ఎలా మాట్లాడితే ఆ పాత్రకి కరెక్ట్ గా సరిపోతుందని అతడికి తెలిసి ఉంటుంది. మొన్నటికి మొన్న ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ లుక్ కి విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అందులో రామ్ చరణ్ లుక్ ని ఇష్టపడిన వారెంత మంది ఉన్నారో ఎన్టీఆర్ గొంతుకి ఫిదా అయిన వారు కూడా అంతే మంది ఉన్నారు.

 

అల్లూరి సీతారామరాజుని ఎన్టీఆర్ గొంతుతో పరిచయం చేయడం ప్రేక్షకులకి బాగా నచ్చింది. కేవలం ఒక నిమిషంన్నర వీడియోతోనే రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాడంటే అది ఎన్టీఆర్ వాయిస్ లోని గొప్పదనమే. నాలుగు భాషల్లో వాయిస్ ఓవర్ వినిపించిన ఎన్టీఆర్.. ప్రతీ భాషలోనూ పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాడు. హిందీ, తమిళ, కన్నడ..ఇలా ఏ భాషలో చెప్పినా అది తన మాతృభాషే అన్నంత సహజంగా చెప్పాడు.

 


అయితే నాలుగు బాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్ మళయాలంలో మాత్రం చెప్పలేకపోయాడు. దాంతో కొంతమంది ఫ్యాన్స్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. దాంతో ఆ భాషని కూడా నేర్చుకోవడానికి ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడట. ప్రస్తుతం లాక్డౌన్ ఉన్న కారణంగా ఎన్టీఆర్ ఈ పనుల్లో బిజీగా ఉన్నాడట. ఆర్.ఆర్.ఆర్ కి ప్రతీ భాషలో కొమరం భీమ్ పాత్రకి ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పాలన్న డిమాండ్ రోజ్ రోజుకీ పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: