కింగ్ నాగార్జున ... అక్కినేని నాగార్జున... ఈపేరు గురించి తెలుగు వారికి మళ్లీ కొత్తగా చెప్పేదేమీ లేదనుకుంటాను... ఎందుకంటే ఆయన ఆరు పదులు దెగ్గర పడుతున్న కుర్రకారుకి ఎంత పోటీ ఇస్తాడో మరి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదను కదా... ఇక ఆయన చేసిన సినిమాల ఇషయానికి వస్తే... మొదట్లో గ్రీకువీరుడు ఇమేజ్, ఆ తర్వాత మన్మథుడు, కింగ్... ఇలా ఒక్కో టైం లో ఒక్కో రకంగా వివిధ ముద్దు పేర్లు సొంతం చేసుకున్న అక్కినేని నాగార్జున కుటుంబంలో మొత్తానికి మూడు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీలున్నాయనే సంగతి మీకు తెలుసా...? అయితే ఈ మూడు లవ్ స్టోరీలు ఎలా మొగ్గ తొడిగాయి, ఎక్కడ మొదలయ్యాయి అనేది మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. ఇక లేట్ ఎందుకు ఆ విషయం ఏందో చూద్దాం.


ముందుగా నాగ్, అమల లవ్ స్టోరీ చూస్తే...  1989 సంవత్సరంలో రాంగోపాల్ వర్మ అష్టకష్టాలు పడి దర్శకుడిగా అవకాశం తెచ్చుకొని శివ సినిమాకు షూటింగ్ జరుగుతున్న రోజులు. అయితే అప్పటికే నాగార్జున కిరాయి దాదా, చినబాబు వంటి చిత్రాల్లో అమలతో కలిసి నటిస్తున్నారు. కాకపోతే అప్పటికే ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉన్నపటికీ.. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచింది మాత్రం శివ సినిమా షూటింగ్ అంట. 

 

ఇక ఆ సాన్నిహిత్యమే కోడిగా ముదిరి ప్రేమగా మారింది. ఇక అనంతరం మూడు సంవత్సరాలు డేటింగ్ చేసిన ఈ జంట 1992 సంవత్సరంలో చెన్నైలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే అప్పటికే అమల కన్నా ముందుగా లక్ష్మితో నాగార్జునకి వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే నాగచైతన్య కాగా, ఇక నాగ్, అమల వివాహం అనంతరం ఆ కుటుంబంలోకి సిసింద్రీగా ఎంట్రీ ఇచ్చిన మరో అబ్బాయి అఖిల్. ఇలా ఇప్పుడు నాగ్, అమల జీవితం ప్రశాంతంగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: