టాలీవుడ్ లో కోలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ నయనతార. ఇప్పటికి వయసు మీద పడుతున్నా సరే ఆమె మాత్రం దూకుడుగా సినిమాలు చేస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో కూడా ఆమెకు సీనియర్ హీరోల పక్కన అప్పుడు అప్పుడు ఆఫర్లు కూడా వస్తు ఉన్నాయి. అయినా సరే ఆమె తెలుగు వైపు పెద్దగా చూడటం లేదు. బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చినా ఆమె ఎక్కువగా తమిళం సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక ఇది పక్కన పెడితే పరమ వ్యవహారాల్లో ఆమె ముందు నుంచి దూకుడుగానే ఉంది. 

 

తెలుగు హీరోలతో ప్రేమలో పడకపోయినా తమిళ హీరోలతో మాత్రం ఎక్కువగా ప్రేమలో పడింది. ముగ్గురు నలుగురు హీరోలతో ప్రేమలో పడింది. అందులో ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రభుదేవా కూడా ఉన్నారు. ఆయనకు పెళ్లి అయినా సరే ఆమె మాత్రం పెళ్లి చేసుకోవాలి అని చూసింది. వీరి మధ్య బంధాన్ని ఎవరు ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా వాళ్ళు మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గిన సందర్భం అంటూ పెద్దగా ఏదీ లేదు అనే చెప్పాలి. వీరి ప్రేమ వ్యవహారానికి ప్రభుదేవా భార్య అడ్డం పడింది అని కూడా అన్నారు. 

 

ప్రభుదేవా కోసం తనకు ప్రాముఖ్యత తెచ్చి పెట్టిన సినిమాలను కూడా ఆమె కాదు అని చెప్పింది. అగ్ర హీరోలతో ఆఫర్లు వచ్చినా సరే ఆమె పెళ్లి వైపే ఆసక్తి ఎక్కువగా చూపించింది. ఆ తర్వాత వీరి పెళ్లి ఆగిపోవడం ఆమె మళ్ళీ సినిమాలు చెయ్యాలి అనుకోవడం జరిగింది. ఇప్పుడు మరో దర్శకుడు తో ఆమె ప్రేమలో ఉంది. ఈ ప్రేమ వ్యవహారం కూడా ఆగిపోయింది అంటారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు. ఇప్పుడు వీళ్ళు దూరంగానే ఉన్నారు. ప్రేమ వ్యవహారాలతో ఆమె ఆర్ధికంగా నష్టపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: