అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈమె పెళ్లి ఆ హీరోతో.. ఈ హీరోతో అని ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఇటీవలే కాలం అనుష్క సినిమాలు ఏవి లేకపోయినా ఈమె పెళ్లి వార్తలు మాత్రం ఎక్కువగానే వస్తున్నాయ్. ఇప్పటికే హీరో ప్రభాస్ తో ప్రేమ అని.. త్వరలోనే పెళ్లి అని వార్తలు వచ్చాయి.. 

 

ఇంకా ఈ మధ్యకాలంలో ఓ స్టార్ డైరెక్టర్ కొడుకుని పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి... ఈ వార్తలు ఫేక్ అని తేలింది. ఆ తర్వాత ఓ క్రికెటర్ తో పెళ్లి అని వార్తలు వచ్చాయి.. ఆ వార్తలు కూడా ఫేక్ అని తేలిపోయింది.. అయితే అనుష్క పెళ్లి.. ప్రేమకు సంబంధించి ఇప్పుడే కాదు.. అప్పట్లో కూడా వార్తలు భారీగా వచ్చాయి.. 

 

అనుష్క నాగార్జున.. లవర్స్ అని కూడా ఒకానొక సమయంలో అందరూ అనుకున్నారు.. అలా అనుకునేలా ఒకటికి నాలుగు అయుదు సినిమాలు తీశారు అనుకోండి.. అంతేకాదు.. ఒకట.. రెండా ? ఆఖరికి ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర లేకపోతే గెస్ట్ పాత్ర అయినా చేసేది ఈ భామ.. ఇంకా అలాంటి ఈ అనుష్కకు మరొకరితో లవ్ ఉంది అని అంటగట్టారు.. 

 

అది ఎవరితో అంటే? గోపీచంద్ తో.. విలన్ లా ఎంటర్ అయ్యి హీరో అయినా గోపీచంద్ అప్పట్లో మంచి మంచి సినిమాలు తీశాడు. అందులో సూర్యం, లక్ష్యం సినిమాలు కూడా ఉన్నాయ్. అయితే ఈ రెండు సినిమాల్లోను అనుష్క ఉంది.. ఇంకా షూటింగ్ సమయంలో నవ్వుతు మాట్లాడటం చుసిన జనం.. ఇద్దరు లవ్ లో ఉన్నారు త్వరలోనే పెళ్లి పీఠాలు ఎక్కబోతున్నరు అంటూ వార్తలు వచ్చి హాల్ చల్ చేశాయి.. కానీ మనకు తెలుసు అనుకోండి.. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు అని. 

మరింత సమాచారం తెలుసుకోండి: