టాలీవుడ్ లో ప్రభాస్, అనుష్క ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటి వరకు ఎన్నో కథనాలు వచ్చాయి. వీళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దాదాపు నాలుగేళ్ల నుంచి వీరి పెళ్లి వార్తలు టాలీవుడ్ లో వినపడుతూనే ఉన్నాయి. ఎన్ని విధాలుగా వాళ్ళు వాటిని ఖండించినా సరే అవి ఆగడం లేదు. ఏ విధంగా కూడా వాళ్ళు ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు అనేది అర్ధమవుతుంది. ఇది పక్కన పెడితే వీళ్ళు ముందు నుంచి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని కాని తర్వాత తర్వాత వాళ్ళు కొన్ని కారణాలతో ఆగిపోయారు అంటున్నారు. 

 

దానికి కారణం ఏంటీ అంటే టాలీవుడ్ లో కొందరు పెద్దలు వీరి పెళ్లిని అడ్డుకున్నారట. పెళ్లి చేసుకోవాలని భావించినా సరే వాళ్ళు మాత్రం వీరి పెళ్లిని జరగనివ్వలేదు అని అంటున్నారు. వీరి పెళ్ళికి ముందు నుంచి అడ్డుకున్నారట. ప్రేమలో ఉన్నా సరే చివరికి కొన్ని కారణాలతో పెళ్లిని వద్దు అనుకుని ప్రేమను చంపుకుని వీళ్ళు ఇప్పుడు స్నేహితులు గా సెటిల్ అయ్యారని అంటున్నారు. వీరి పెళ్లి గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. ఎప్పుడు చేసుకుంటారో కూడా వచ్చింది. కాని పెళ్లి మాత్రం ముందుకి వెళ్ళిన పరిస్థితి కనపడలేదు. 

 

ఈ మధ్య కాలంలో మీడియా అనుష్క పెళ్లి మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. అయినా సరే ఆమె మాత్రం ఏమి స్పందించడం లేదు. ఆమె పెళ్లి గురించి ఏమి అడిగినా సరే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం మాత్రమే చేసుకుంటా గాని... ప్రేమించి చేసుకోను అని చెప్తూ వస్తున్నారు. వీళ్ళు పెళ్లి చేసుకోకపోయినా సరే మీడియా కు మాత్రం ఎప్పుడు ఇదొక పెద్ద వార్త. ఏ చిన్న లింక్ వచ్చినా సరే ఏదొకటి రాస్తూనే ఉంటారు. ఇక అనుష్క క్రికెటర్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుని ఆమె ఆగిపోయినట్టు కూడా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: