పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్న తక్కువ సినిమాలే చేశాడే. ఆయనతో పాటు సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే పవన్ మాత్రం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒకానొక సినిమాలో డైలాగ్ లాగా ఎన్ని చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత ఇంపాక్ట్ కలిగించామన్నదే ముఖ్యం పవన్ కళ్యాణ్ కి బాగా వర్తిస్తుంది.

 

 

అయితే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మొదటి సినిమా నుండి ప్రయత్నం కొనసాగింది. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమయ్యాడు. అక్కినేని  కుటుంబం నుండి అక్కినేని సుప్రియ ఆ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.

 

 

అయితే ఈ సినిమాలో అందరికీ గుర్తుండే అంశాలు చాలా ఉన్నాయి. కాలేజీలో స్టూడెంట్స్ మధ్య జరిగే అల్లరి నుండి పవన్ కళ్యాణ్ చేసిన సాహసం వరకూ అన్ని చెప్పుకోదగ్గ అంశాలే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన సాహసం గురించి చెప్పుకోవాలి. సినిమాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ కరాటే సాధన చేసేవాడట. కరాటే, ధ్యానం వంటివి నిత్యం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడట.

 

అందుకే తన మొదటి సినిమాలో తన గుండెలపి బండలని పెట్టుకుని పగలకొట్టించుకున్నాడు. అలాగే తన చేతివేళ్ల మీదనుండి కార్లని పోనిచ్చుకున్నాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ నిజంగా చేసినవే. సినిమా కోసం ప్రేక్షకులకి ఒక రియల్ లైఫ్ అనుభూతిని ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సాహసం చేశాడు. అయితే అంతకుముందు వేరే ఏ హీరో కూడా ఇలాంటివి ట్రై చేయలేదు. అందుకే ఆ సీన్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకి గుర్తుంది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: