కరోనా కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. ఈ మహమ్మారి మనదేశం నుండి ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ప్రజలకి ఉపాధి లేక, ఉగ్యోగాలు కోల్పోయారు. కోవిడ్ ౧౯ మన జీవితాలని అతలాకుతలం చేసేసింది. మళ్లీ ఎప్పుడు స్థిరత్వానికి వస్తుందో తెలియని పరిస్థితి. సినిమా రంగంపై కరోనా ప్రభావం చాలా పడింది.

 

 

షూటింగ్ పూర్తయి విడుదలకి సిద్ధమయిన సినిమాలు లాక్డౌన్ కారణంగా ల్యాబుల్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే థియేటర్లు ఇప్పడప్పుడే తెరుచుకునేలా లేవు. రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతుండడంతో సామాజిక దూరం పాటించాలన్న నియమాలు ఎక్కువ అవుతున్నాయి. కరోనాని నియంత్రించిన తర్వాత కూడా ఈ నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. 

 


అందువల్ల థియేటర్లు మాల్స్ తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా ప్లానులన్నీ తారుమారైనాయి. భారీ బడ్జెట్ లో చిత్రాలని తెరకెక్కిద్దామనుకున్న నిర్మాతలు అటువైపు చూసే పరిస్థితి కనిపించడం లేదు. బాహుబలి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రమైన అరణ్యలో నటిస్తున్నాడు. ఇటు తెలుగులో వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వంలోనూ చేస్తున్నాడు.

 

 

అయితే ఈ సినిమాల తర్వాత రానా గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం హిరణ్య కశిపలో నటించేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించడం కష్టం అని అంటున్నారు.

 

 

సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని కొన్ని రోజులు పక్కన పెట్టాలని చూస్తున్నాడట. అంటే కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చాక కానీ ఈ  సినిమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుందో..

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: