తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో నాలుగు ద‌శాబ్దాల పాటు తిరుగులేని హీరోగా వెలుగొందిన కృష్ణ సూప‌ర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. నిర్మాత‌ల హీరోగా పేరున్న కృష్ణ 1970, 1980వ ద‌శ‌కాల్లో సంవ‌త్స‌రానికి ఏకంగా 10కు పైగా సినిమాల్లో న‌టించాడు. త‌న ద్వారా ఏ నిర్మాత అయినా న‌ష్ట‌పోతే ఎంతో మందికి ఫ్రీ కాల్షీట్లు ఇచ్చిన ధీరోదాత్తుడు కూడా కృష్ణ‌. అలాంటి కృష్ణ‌కు అటు వెండి తెర మీద వెండి తెర‌క వెన‌కాల చాలా ప్రేమ క‌థ‌లే ఉన్నాయ‌ట‌.

 

ఆయ‌న నిజ జీవితంలో చూస్తే అప్ప‌ట్లో తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ హీరో అయిన సూపర్ స్టార్ క్రిష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట 1961లో ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు. వారికి మహేశ్ బాబు, రమేశ్ బాబుతో పాటు ఇద్ద‌రు అమ్మాయిలు సంతానం. అయితే అదే టైంలో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీర‌యిన్‌గాను, ద‌ర్శ‌కురాలిగాను తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న విజ‌య నిర్మల‌తో సినిమాల్లో ఆయ‌న‌కు స‌న్నిహిత్యం ఏర్ప‌డింది.

 

ఈ క్ర‌మంలోనే వారిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా వారు విడిచి ఉండలేనంత వ‌ర‌కు వెళ్లిపోయింది. అయితే అప్ప‌టికే విజ‌య నిర్మ‌ల‌కు మ‌రో వ్య‌క్తితో పెళ్ల‌య్యి న‌రేష్ పుట్టాడు. విజ‌య నిర్మ‌ల సినిమాల్లో ఉండ‌డంతో వారిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన గ్యాప్ కాస్తా వారు విడిపోయే వ‌ర‌కు వెళ్లింది.  ఆ తర్వాత 1969లో నటి విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నాడు. విజయ నిర్మలాకు కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం. ఆ త‌ర్వాత విజ‌య నిర్మ‌ల - కృష్ణ కాంబినేష‌న్ వెండి తెర‌పై తిరుగులేని ఫెయిర్ అయ్యింది.

 

విజ‌య నిర్మ‌ల‌కు కృష్ణ తో పెళ్ల‌య్యాక ఆమెకు ఎక్క‌డా లేని పేరు వ‌చ్చింది. ఆమె అనేక సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఓ మ‌హిళా ద‌ర్శ‌కురాలిగా ఎన్నో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి గిన్నీస్ రికార్డుల్లోకి కూడా ఎక్కారు. ఇక ఇవి కాకుండా కృష్ణ‌కు అప్ప‌ట్లో కొంద‌రు స్టార్ హీరోల‌తో ప్రేమ క‌థ‌లు ఉన్న‌ట్టు పుకార్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: