క‌రోనా  లాక్ డౌన్ ఒక్కొక్క‌రికి ఒక్కోలా క‌లిసొస్తోంది. కొంద‌రు హీరోలు అయితే నేరుగా ఫామ్ హౌస్ ల‌కు వెళ్లిపోవ‌డ‌మే కాదు.. ఏకంగా త‌మ‌తో స్నేహంగా మెలిగే క‌థానాయిక‌ల‌కు అక్క‌డికి రావాల్సిందిగా ఆహ్వానించేస్తుడ‌డంతో స‌ద‌రు భామ‌లు కూడా మొహ‌మాటానికి తావివ్వ‌కుండా దానిని అడ్వాంటేజ్ గా తీసుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. న‌గ‌రాలకు జ‌న‌స‌మ్మ‌ర్థ‌మైన చోట్ల‌కు దూరంగా ఫామ్ హౌస్ ల‌కు వెళ్లిపోతే అక్క‌డికి క‌రోనా త‌రుముకు రాద‌న్న ధీమా వీళ్ల‌లో క‌నిపిస్తోంద‌ట‌. క‌రోనాకి విరుగుడు.. సేమ్ టైమ్ రొమాంటిగ్గా ఎంజాయ్ చేసేందుకు.. ఇదే త‌గిన స‌మ‌‌య‌మ‌ని కొంద‌రు భావిస్తున్నార‌ట‌. ఈ జీవితానికి సార్థ‌క‌త‌ను వెతుక్కునేందుకు ఫామ్ హౌస్ లు ఆలంబ‌న‌గా మారాయ‌ట‌.

 

కార‌ణం ఏదైనా.. అలా ఫామ్ హౌస్ ల‌కు వెళ్లిపోయిన హీరోలు స‌ద‌రు క‌థానాయిక‌ల‌తో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఒక‌రోజు కాదు.. రెండు రోజులు కాదు ఏకంగా వారాల‌కు వారాలు ఫామ్ హౌస్ క్వారంటైన్ టైమ్ ని న‌చ్చిన‌ట్టు ఆస్వాధిస్తున్నారు. ఇక పాశ్చాత్య సంస్కృతి ని ఎప్పుడో ఎడాప్ట్ చేసుకున్న బాలీవుడ్ హీరోలు అయితే ఓపెన్ గానే గాళ్ ఫ్రెండ్స్ ని ఆహ్వానిస్తూ ఫామ్ హౌస్ ల‌కు వెళ్లిపోవ‌డం అక్క‌డ ఎంజాయ్ చేయ‌డం క‌నిపిస్తోంది. పెళ్ల‌యిన హీరోల్ని మిన‌హాయిస్తే ఈ త‌ర‌హా క‌ల్చ‌ర్ బ్యాచిల‌ర్ హీరోల‌కు రొటీన్ గా మారింది. ఇక ఈ క్వారంటైన్ టైమ్ ని బాలీవుడ్ కి చెందిన ఓ వెట‌ర‌న్ హీరో ఓ రేంజులో ఎంజాయ్ చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది. క్వారంటైన్ పేరుతో త‌న‌కు అత్యంత స‌న్నిహిత నాయిక‌లుగా పేరు బ‌డ్డ ఓ ఇద్ద‌రిని ఆ స్టార్ హీరో ఫామ్ హౌస్ కి పిల‌వ‌డంతో ఇక అక్క‌డ ర‌చ్చ అంతా ఇంతా కాదు. స‌ద‌రు హీరోగారితో క‌లిసి రేసు గుర్రం లాంటి గుర్రంపై షికార్లు చేస్తున్నారు. ఆ గుర్రాన్ని ముద్దాడుతున్నారు. 

 

దాంతో న‌చ్చిన‌ట్టు ఫోటోలు దిగుతున్నారు. ఇప్పుడు అవ‌న్నీ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అయిపోతున్నాయి. అయితే అదంతా స‌రే కానీ.. స‌ర‌సాలు అక్క‌డివ‌ర‌కేనా? హ‌ద్దులు మీరారా? అంటూ ఒక‌టే కామెంట్లు ప‌డిపోతున్నాయి. ఇప్ప‌టికే ఫామ్ హౌస్ కి వెళ్లి వారం పైగా అయ్యింది. అయినా ఇంకా ఆ హీరోయిన్లు అక్క‌డి నుంచి ఇండ్ల‌కు రానే లేదు. కొన్ని వారాల పాటు కరోనా లాక్ డౌన్ కొన‌సాగేట్టు ఉంది ప‌రిస్థితి. దీంతో వీళ్లంతా అక్క‌డే తిష్ఠ వేసిన‌ట్టే క‌నిపిస్తోంది. టాలీవుడ్ లోనూ ప‌లువురు స్టార్ హీరోల‌కు హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్ స‌హా బెంగ‌ళూరు ఔట్ స్క‌ర్ట్స్ లోనూ ఫామ్ హౌస్ లు ఉన్నాయి. అటు త‌మిళ హీరోల‌కు ఫామ్ హౌస్ లు ఉన్నాయి. మ‌రి వీళ్లంతా స‌ద‌రు భాయ్ ని చూసి నేర్చుకోవాలి! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైన‌ప్ప‌టికి ఈ క‌రోనా కొంత మంది సినీ సెల‌బ్రెటీల‌కు మాత్రం మంచి ఎంజాయ్‌మెంట్ టైమ్ అన్న‌ట్లు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: