న్యాచురల్ స్టార్ నాని.. ఓ సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు. తనదైన నటనతో న్యాచురల్ స్టార్‌గా పేరొంది.. ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే నాని.. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా అవతారం ఎత్తి సక్సెస్ అయ్యాడు. ఇక నాని.. విశాఖపట్నానికి చెందిన అంజనాను ఐదేళ్ల పాటు ప్రేమించి.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2012లో వివాహం చేసుకొన్నారు. నాని జీవితంలో భార్య అంజనా అడుగుపెట్టిన తర్వాత అతడి కేరీర్ సినీ వినీలా ఆకాశంలో తారాజువ్వలా దూసుకుపోతున్నది.
ఈయన లవ్ స్టోరి కూడా చాలా న్యాచురల్‌గానే ఉంటుంది. న్యాచురల్ స్టార్ నాని భాగ్యనగరంలో అప్పటి తన ప్రియురాలు అంజనాతో కలిసి అల భాగ్యనగరంలో షికార్డు కొట్టేవారట. నాని ఆరోజుల్లో ఓ ప్రముఖ ఎఫ్ఎం ఛానెల్లో ఇంటర్న్ షిప్ చేసే సమయంలోనే అంజనాతో ప్రేమాయణం మొదలైంది. అదే సమయంలో అంజనాను చూడడానికి నాని ఆ ఎఫ్ంఎం ఛానెల్ బయట గంటల కొద్దీ పడిగాపులు కాసేవాడట. అయితే హీరోగా ఎప్పుడైతే నిలదిక్కుకుంటున్నాడో.. ఆ తొలి రోజుల్లోనే తన స్నేహితుడికి కజిన్ వరసైన అంజనా యలవర్తితో స్నేహం చేశాడట.
ఇక వీరి పరిచయమైన తొలి రోజుల్లో ఒకరంటే ఒకరికి పడి చచ్చేంత ఇష్టమున్నా వారు ఆ ప్రస్తావనను ఎప్పుడూ బయటపెట్టుకోలేదట. ఆ తర్వాత నాని, అంజనా ఇద్దరు ఐదు సంవత్సరాల పాటు పేస్ బుక్ చాటింగ్ ప్రేమలో మునిగిపోయారు. ఇక వీరిద్దరి ప్రేమ విషయం పెద్దలకు తెలపడంతో వారి ఇరు కుటుంబాల్లో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. దీంతో వీరిద్దరూ కలిసి కుటుంబం, పెద్దలు, స్నేహితుల సమక్షంలో 2012లో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2017లో ఉగాది రోజున అర్జున్ జన్మించాడు. ఇక నాని జీవితంలో కొడుకు రాకతో మరింత కలర్ఫుల్గా మారింది. ప్రస్తుతనం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నా ఈయన భార్యా, కొడుకుతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.