ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 


అయితే, కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.  ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది పేదలకు అన్నదానం అందజేస్తూ వస్తున్నారు.. మరీ కొందరు సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.ప్రజల్లో కొత్త ఉస్తాహాన్ని నింపుతున్నారు.. 

 

 

 

 

కరొనను ఎదుర్కోవడానికి  ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..లాక్ డౌన్  ఎఫెక్ట్ దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనుంది. లాక్ డౌన్  కారణంగా తెలంగాణలో ఇప్పటికే ఉత్పత్తులు, ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇక  లాక్ డౌన్  వేళ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు తప్పనిసరి కొనసాగించాల్సిన స్థితి నెలకొంది. 

 

 

 


కరోనా కట్టడి పై ప్రజల్లో చైతన్యాన్ని నింపడానికి  సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు.  ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోని చాలా మంది తమ పాటల ద్వారా కరోనా నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో అన్న విషయాలను తెలియ పరుస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ ఓ పాటను ఆలపించి సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. కూటికోసం.. కూలి కోసం పొట్ట పట్టుకొని పట్టణం వచ్చిన  వలస కూలీ వందనం .. అంటూ సాగిన అద్భుతమైన లిరిక్స్ ప్రజలను ఆకట్టుకున్నాయి. దీంతో ఆ పాట సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ .. ప్రశంసలు అందుకుంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: