టాలీవుడ్ కీర్తి కిరీటాన్ని హాలీవుడ్ రేంజి దాకా తీసికెళ్ళిన నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఎందో మంది ఉన్నారు. ఒక శంకరాభరణం. బాహుబలి వంటి మూవీస్ దానికి అచ్చమైన ఉదాహరణ. అటువంటి టాలీవుడ్ ఇపుడు స్లంప్ అన్న మాట కంటే పెద్ద ఆపదనే ఎదుర్కొంటోంది. టాలీవుడ్లో ఇపుడు ఒక రకమైన భయం ఆవహించింది. నిన్నటిలా రేపు ఉండదు అన్నది కచ్చితంగా అర్ధమవుతోంది.

 

నిజంగా పాన్ ఇండియా మూవీ అంటూ 2011 లో రోబోని తమిళ డైరెక్టర్  శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో  తీసిన తరువాత సౌత్ ఇండియా రేంజి పెరిగింది. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఆ వైపుగా చూశారు. ఆయన తన స్టామినా అంతా ఉపయోగించి తీసిన బాహుబలి వన్, టూ మూవీస్ సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. బాలీవుడ్లో కూడా బాజా మోగించేశాయి.

 

దాంతో ఆ తరువాత పాన్ ఇండియా మూవీకి టాలీవుడ్లో యమ గిరాకీ పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి కూడా సైరా నరసింహారెడ్డి మూవీ తీశారు. ప్రభాస్ సాహో అంటూ బాలీవుడ్ వరకూ జెండా పాతగలిగారు. ఇపుడు అ రేంజిని అందుకునే సినిమాలు ఓ డజన్ వరకూ ప్రతిపాదనల్లో ఉన్నాయి.

 

కొన్ని సెట్స్ మీదకు వెళ్తే మరికొన్ని డిస్కషన్ స్థాయిలోనే ఉన్నాయి. అయితే లాక్ డౌన్ అనంతర పరిస్థితుల‌ను బేరీజు వేసుకుంటున్న నిర్మాతలు కొందరు తమ సినిమాలు ఏ దశలో ఉన్నా ఇక్కడితో వాటిని ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లుగా భోగట్టా. ఆ విధంగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఒక యువ హీరోతో తీస్తున్న మూవీని పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని అంటున్నారు.

 

అదే విధంగా పాన్ ఇండియా మూవీస్ అంటూ హడావిడి చేసిన మరో ప్రముఖ కుటుంబానికి  చెందిన హీరో కూడా గప్ చిప్ అయ్యాడుట. ముందు సినిమాలు బతకాలి, జనాలు సినిమా హాళ్ళకు మళ్ళీ అలవాటు అవాలి, అప్పటికి ఎంత టైం పడుతుందో. అది జరిగి గత వైభవం వస్తుందో రాదో కూడా ఇప్పటికైతే చెప్పలేమని కూడా అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే టాలీవుడ్లో పాన్ ఇండియా మూవీస్ అన్న పదం ఇపుడు వినబడడంలేదుట. 

 

బిగ్ ప్రాజెక్టులు కూడా ఒకటి రెండు అనౌన్స్ చేసినా ఎలా పట్టాలెక్కించాలని కూడా ఆలోచన చేస్తున్నారుట. మొత్తం మీద టాలీవుడ్ పాన్ ఇండియా ఆశలకు కరోనా వైరస్ కాటు వేసిందని చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: