కాలానుగుణంగా మనుషులు మారటం తో పాటు టెక్నాలజీలో కూడా మార్పులు వస్తున్నాయి. వాటికి ఉదాహరణే ఈ ఓటిటి డిజిటల్ ప్లేట్ ఫార్మ్స్. తాజాగా ఈ డిజిటల్ రంగంలో అడుగుపెట్టిన ఆహా ప్రేక్షకుల ఆదరణ బాగానే దక్కించుకుంటుంది. మొన్నటి వరకూ సిటీల వరకే పరిమితమైన  ఓటిటి డిజిటల్ ప్లేట్ ఫార్మ్స్...కరోనా వైరస్ పుణ్యమా గ్రామాలకు కూడా పాకిపోయింది. అల్లు అరవింద్ ప్రవేశపెట్టిన ఈ ఆహా యాప్ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో 'ఆహా' యాప్ లో ఉన్న వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సినిమా థియేటర్లు మూత పడటంతో...ఆడియన్స్ అంతా వెబ్ సిరీస్ ల మీద పడ్డారు. లాక్ డౌన్ కారణంగా ఆహా యాప్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్ వివరాలు  ఒకసారి చూద్దాం.

 

 

  1. Locked

 

సత్యదేవ్ నటించిన ఈ సీరీస్ ఆద్యంతం ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. థ్రిల్లర్ జెన్రీ లో తీయడం తో తెలుగు వాళ్ళకి ఇది ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. అయితే ఇంటర్నేషనల్ సీరీస్ లకి ధీటుగా తక్కువ బడ్జెట్ లో తీశాడు అని చెప్పచ్చు. 

 

  1. SIN 

 

వైవాహిక అత్యాచారాల గురించి ఈ సీరీస్ చెబుతుంది. మన సమాజం లో పెళ్లి పేరుతో జరుగుతున్న దారుణాలని కళ్ళకి కట్టేల , నాలుగు గోడల మధ్య ఆడవాళ్ళని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో క్లియర్ గా చూపించిన సీరీస్. చాలా బొల్డ్ గా తీశారు అనే చెప్పాలి. జార్జి రెడ్డి లో నటించిన తిరువీర్ ముఖ్య పాత్ర పోషించాడు. దీప్తి సటీ నటన ఆకట్టుకుంటుంది. 

 

  1. Kothaporadu 

 

కామెడీ నేపధ్యం లో తీసిన ఈ సీరీస్ పూర్తిగా బొల్డ్ మరియూ రా(raw) గా సాగుతుంది .. ప్రతీ కారెక్టర్ నీ డిజైన్ చెయ్యడం లో డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు. పాత్రలతో వ్యూయర్స్ కనక్ట్ అయ్యేలాగా తీశారు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే, పచ్చిగా చెప్పే నిజాలి ఇవన్నీ ఆకట్టుకుంటాయి. 

 

  1. Mastis 

 

ఈరోజుల్లో అబ్బాయి అమ్మాయి మధ్యన రిలేషన్ షిప్ లు ఎలా ఉంటున్నాయి అనే దాని మీద తీసిన కథ. డైరెక్టర్ క్రిష్ దీన్ని డైరెక్ట్ చేయడం విశేషం. నవదీప్ ప్రధాన పాత్ర పోషించాడు. తక్కువ సమయం లోనే ఎక్కువ వ్యూస్ తెచ్చుకున్న సీరీస్ గా ఆహా యాప్ లో ఈ సీరీస్ రికార్డ్ కొట్టింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: