ఎండాకాలంలో కొంచెం రిలాక్స్ అయ్యేందుకు ఏసీ వేద్దాం అనుకుంటున్నారా…. అయితే తస్మాత్ జాగ్రత్త. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా వైరస్ ఏసీ గాలి ద్వారా కూడా వ్యాపిస్తోంది అని ఇప్పుడు ఆధారాలు వచ్చేశాయి. వివరాల్లోకి వెళితే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో ఒక రెస్టారెంట్ లో ఏసీ గారి ద్వారా మూడు ఫ్యామిలీల సభ్యులందరికీ కరోనా సోకినట్లు ఒక నివేదిక వెల్లడించింది

 

ఘటన జరిగే సమయానికి వుహాన్ నగరంలో లాక్ డౌన్ పూర్తిగా ప్రకటించలేదు. సమయంలో Guangzhou ప్రావిన్స్ లో ఉన్న ఒక రెస్టారెంట్ కి డిన్నర్ చేసేందుకు మూడు ఫ్యామిలీలు వెళ్లాయి. అక్కడ డైనింగ్ టేబుల్ పై కూర్చుని భోజనం చేస్తున్న ఇంకో కుటుంబం వుహాన్ నగరం నుండి రెస్టారెంట్ కు వచ్చారు. వారిలో ఒకరికి కరోనా వైరస్ సోకి ఉంది. విషయం వారికి కూడా తెలియదు. దీంతో వారితో పాటు రెస్టారెంట్లో కూర్చుని భోజనం చేస్తున్న మరో మూడు ఫ్యామిలీలోకి వైరస్ సోకింది. కొన్ని రోజుల తర్వాత మొత్తం తొమ్మిది మందిలో వైరస్ లక్షణాలు కనిపించగా విచారణలో తేలింది ఏమిటంటే వారెవరూ వైరస్ సోకిన బాధితులతో ఎప్పుడూ కలవలేదు అని.

 

మరి వీరికి ఎలా వచ్చింది అని ఇంకొచెం లోతుగా విచారించగా... వారందరి మధ్య కామన్ గా ఉన్న పాయింట్ వారు కొద్ది రోజుల క్రితం డిన్నర్ చేసిన రెస్టారెంట్. అప్పుడు పూర్తి వివరాలు సేకరిస్తే... వుహాన్ సిటీ నుండి వచ్చిన కుటుంబం వల్ల వీరికి ఏసీ ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. చైనీస్ రెస్టారెంటులో జరిగిన ఆసక్తికరమైన కేసును చైనా సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కు చెందిన నిపుణులు గుర్తించినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.  వైరస్ బాధితుడు తుమ్మినా లేదా దగ్గినప్పుడు వారి నుంచి నీటి బిందువులు.. వైరస్ ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని చైనీస్ పరిశోధకులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: