కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవటంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిపోయింది. అని వ్యవస్థలు ఎక్కడికక్కడ స్థంబించిపోయాయి. సెలవులు ఉన్నాగాని అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఒకానొక టైములో సెలవులు వస్తే సినిమాలకు మరియు పార్కులకు ఏదోవిధంగా ఎంటర్టైన్మెంట్ కోసం అనేక మార్గాలు కనబడేవి. అయితే కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయాయి. అన్ని సినిమా థియేటర్లు మరియు షాపింగ్ మాల్స్ అదేవిధంగా పార్కులు మొత్తం క్లోజ్ అయిపోయాయి.

 

దీంతో బాగా ఎంజాయ్ కి అలవాటు పడ్డ మనిషి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంజాయ్ చేస్తున్నారు. రకరకాల మార్గాల ద్వారా లాక్ డౌన్ సమయాన్ని గడుపుతున్నారు. అయితే ఎక్కువగా డిజిటల్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా టాప్ రేటింగ్ కలిగిన ఐదు బ్లాక్ బస్టర్ సినిమాలు వివరాలు మీకోసం. బాహుబలి 1, అల వైకుంఠపురంలో, కేరాఫ్ కంచరపాలెం, ఈ నగరానికి ఏమైంది, సాహో. ఈ ఐదు సినిమాలను ప్రేక్షకులు బాగా చూస్తున్నారు.

 

ముఖ్యంగా 'అలా వైకుంఠపురంలో' త్రివిక్రమ్ సినిమా మార్క్ కావటం తో పాటుగా... పాటలు సూపర్ డూపర్ హిట్ కావడంతో బన్నీ అలా వైకుంఠపురం కి బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా ఈ నగరానికి ఏమైంది సినిమాని కూడా నెట్ ఫ్లిక్స్ లో చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలావరకు ఏమి పని లేక ఇళ్లల్లో ఉండటంతో జనాలంతా ఓటిటి ద్వారా అనేక సినిమాలు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం కూడా బాగా పెరిగినట్లు ఇటీవల వార్తలు వినబడుతున్నాయి. దానికి తోడు మొబైల్ డేటా ఆఫర్లు కూడా కంపెనీలు ప్రకటిస్తూ ఉండటంతో... జనాలంతా సోషల్ మీడియాలో లాక్ డౌన్ నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: