సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా  తమ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ తమ అభిమానులను అలరిస్తోనే  ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను  అయోమయంలో పడేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కు చెందిన ఓ హాట్ హీరోయిన్ కూడా ఇలాంటిదే  చేసింది. తన పుట్టిన రోజు ముందు ఒక ఫోటో పోస్ట్ చేసి అభిమానులందరినీ అయోమయంలో పడేసింది. ఇంతకీ ఆ హాట్ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నా... మల్లికా శెరావత్. అక్టోబర్ 24న మల్లికాశెరావత్ తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నది.  

 

 అయితే తన పుట్టిన రోజు జరుపుకోవడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ తన పుట్టినరోజు వేడుకలు యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ తన చిన్ననాటి ఫోటో ఒకటి  సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది మల్లికా శెరావత్. ఇంస్టాగ్రామ్ లో తన చిన్ననాటి ఫోటోలు పోస్ట్ చేసిన మల్లికా శెరావత్... ఆమె తన తల్లిని కోల్పోయింది అని కూడా వెల్లడించింది. ఈ ఫోటోలో మల్లికాశెరావత్ తన కుటుంబంతో కలిసి ప్రత్యేకంగా పుట్టినరోజు జరుపుకుంటున్నది . అయితే బాలీవుడ్ లో తన హాట్ హాట్ అందాలతో అభిమానులకు పిచ్చెక్కించే మల్లికా శెరావత్..తన చిన్ననాటి  ఫోటోలో  కూడా ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు. 

 


 చిన్న జుట్టు రెండువైపులా ప్రిన్స్ తో  ఉంది... మల్లికా శెరావత్ తల్లి సంతోష శరావత్ కూడా ఎడమవైపున ఉన్న చిత్రంలో చూడవచ్చు. అయితే ఈ చిత్రాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్... తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని అభిమానులతో పంచుకుంది .దీంతో  ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులందరూ ఒకరోజు ముందుగానే మల్లికా శెరావత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏదేమైనా ఈ హాట్ బ్యూటీ తన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసే అభిమానులలో కాసింత అయోమయంలో పడేసింది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: