ఎన్.టి.ఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ చాలా శక్తి వంతమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న భారీ మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా అందరూ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. బాహుబలి తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం తో ఆర్.ఆర్.ఆర్ తో కూడా ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీని సంపాదించుకోబుతున్నారన్న టాక్ ఇప్పటికే మొదలైంది.

 

అందుకు కారణం రీసెంట్ గా చరణ్, తారక్ ల ఫస్ట్ లుక్ అలాగే రాం చరణ్ పాత్రకి సంబంధించిన అల్లూరి సీతారామరాజు టీజర్ రిలీజ్ చేయగా అంద్భుతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ టీజర్ తో ఒక్కసారిగా సినిమా మీద అంచానలు ఆకాశాన్ని తాకాయి. ఇక త్వరలో తారక్ టీజర్ కూడా రిలీజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ లో రక రకాల ఊహాగానాలు వస్తున్నప్పటికి రాజమౌళి మాత్రం అవన్ని నమ్మొద్దని ఎటువంటి పరిస్థితుల్లో సినిమాని జనవరి 8 న రిలీజ్ చేస్తామని కన్‌ఫం గా చెబుతున్నారు.

 

ఇక ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతాడు. ఇప్పటికే ఎన్.టి.ఆర్ 30 వ సినిమాగా తెరకెక్కబోయో ఈ సినిమాకి అయినను పోయిరావలె హస్తినకు అన్న టైటిల్ ని ఫిక్స చేశారు. ఇదిలా ఉంటే ఎన్.టి.ఆర్ కూడా కొత్త బ్యానర్ ని స్థాపించి ఆ బ్యానర్ మీద సినిమాలు తీయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం కలిసి నటించడానికి మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నారట. ఎటు మైత్రీ మూవీస్ లో ఎన్.టి.ఆర్ కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆగిందని తాజా సమాచారం. కాబట్టి ఎన్.టి.ఆర్ తన బ్యానర్ లో అన్నదమ్ములు ఇద్దరు కలిసి నటించే విధంగా సన్నాహాలు చేస్తున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: