బన్నీ అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య ౨ చిత్రాల తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ ని పెట్టారు. సినిమాలో బన్నీ పేరు పుష్పరాజ్ కాగా, అందరూ పుష్ప అని పిలుస్తుంటారట. అందుకే ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమా నుండి విడుదలైన బన్నీ లుక్ కి మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్నట్లు తెలిసిందే. బన్నీ లుక్ గాగే రష్మిక లుక్ కూడా పల్లెటూరి అమ్మాయిలా ఉండనుందట. ఆల్రెడీ రష్మికపై లుక్ టెస్ట్ కూడా జరిగిందట. రష్మిక లుక్ పట్ల సుకుమార్ సంతృప్తికరంగా ఉన్నాడట. అయితే ఈ సినిమాలో రష్మికతో పాటు మరో హీరోయిన్ కూడా ఉండనుందట. సెకండ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారట.

 

జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన భామ నివేధా థామస్ ని సెకండ్ హీరోయిన్ ప్లేస్ లో తీసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే నివేధా ఈ సినిమాలో బన్నీ లవర్ గా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ రివేంజ్ డ్రామాలో రష్మిక, బన్నీల మధ్య లవ్ ట్రాక్ ఉండదని అంటున్నారు.

 

సెకండ్ హీరోయిన్ గా చేసేవారితోనే బన్నీ ప్రేమాయణం సాగిస్తాడని అంటున్నారు. అయితే అదంతా పక్కన పెడితే సెకండ్ హీరోయిన్ అవకాశం నివేధాకే వచ్చే అవకాశం ఉందట. ఇప్పటికైతే ఈ విషయమై అధికారికంగా సమాచారం రాలేదు. ఒకవేళ పుష్ప సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నివేధా సెలెక్ట్ అయితే ఆమె కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది. మరి అంతటి అదృష్టం నివేధాకి దక్కుతుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: