రామ్ చరణ్ కెరీర్ లో డైలాగులకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా అతని కెరీర్ లో చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం బాగా పాపులర్ అయ్యాయి అనే చెప్పుకోవచ్చు. చిరుత సినిమా దగ్గరి నుంచి ప్రతీ సినిమాలో కూడా ఆయన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పవచ్చు. రామ్ చరణ్ కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి. ఈ సినిమాలో అతని నోటి నుంచి వచ్చిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పవచ్చు. నా పేరు చిట్టిబాబు... ఈ ఊరికి మనమే సౌండ్ ఇంజనీర్, అందరికి సౌండ్ వినపడుద్ది... నాకు సౌండ్ కనపడుద్ది అందుకే మన ఓర్లో అందరూ నన్ను సౌండ్ ఇంజనీర్ అంటారు అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ ఆ సినిమాకు హైలెట్. 

 

తూఫాన్ సినిమాలో ఉండే కొన్ని డైలాగ్స్ కూడా బాగానే హిట్ అయ్యాయి. నీకు సైలెంట్ గా పని చేయడం అలవాటు అయితే నాకు వైలేంట్ గా రియాక్ట్ అవ్వడం అలవాటు అంటూ రామ్ చరణ్ నోటి నుంచి వచ్చిన డైలాగ్ బాగా క్లిక్ అయింది మగధీర సినిమాలో కూడా అతని నోటి నుంచి మంచి డైలాగ్స్ వచ్చాయి. ఆ సినిమాలో ఉండే డైలాగ్స్ ఇప్పటికి వినపడుతూనే ఉంటాయి. ప్రతీ సీన్ లో కూడా రామ్ చరణ్ నోటి నుంచి ఆ సినిమాలో మంచి డైలాగ్స్ వచ్చాయి. 

 

అలాగే... ఎవడు సినిమాలో కూడా రామ్ చరణ్ నోటి నుంచి వచ్చిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో అతని నోటి నుంచి ఏ డైలాగ్స్ వస్తాయా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అతను ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: