లాక్ డౌన్ పీరియడ్ కొనసాగుతున్నా సుకుమార్ మాత్రం ఒక్క క్షణం ఖాళీగా లేకుండా ‘పుష్ప’ స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నాడు. ఒకవైపు ఈ సినిమాకు సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ ఇస్తున్న ట్యూన్స్ విషయం పై తన అభిప్రాయాలు తెలియచేస్తూ ఈ మూవీలో నటించే ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉండేలా సుకుమార్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక పాత్ర కేవలం గ్లామర్ పాత్ర కాకుండా ఆమె నటనకు అవకాశం ఉండే పాత్రగా సుకుమార్ ఈ మూవీలోని రష్మిక పాత్రను డిజైన్ చేయడమే కాకుండా ఈ మూవీలోని బన్నీ పాత్రతో సరిసమానమైన ప్రాధాన్యత రష్మిక కు ఉండేలా సుకుమార్ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈమూవీలో రష్మిక తో చిత్తూరు యాస డైలాగులు చెప్పించడానికి ఆమెకు కూడ ఈ చిత్తూరు యాస కు సంబంధించి ఒక ప్రత్యేకమైన ట్యూటర్ ను పెట్టించి ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న రష్మిక కు సుకుమార్ ఆన్ లైన్ పాఠాలు చెప్పిస్తున్నట్లు టాక్. 


‘రంగస్థలం’ మూవీలో సమంత రామలక్ష్మి పాత్ర స్థాయిలో రష్మిక పాత్ర ఉంటుంది అని అంటున్నారు. సాధారణంగా సుకుమార్ సినిమాలలో హీరోయిన్స్ పాత్రకు చాల ప్రాధాన్యత ఉండటమే కాకుండా కొన్ని సందర్భాలలో హీరోలకు సవాల్ విసిరే విధంగా సుకుమార్ సినిమాలలో హీరోయిన్స్ పాత్రలు ఉంటాయి.


స్వతహాగా చాల చలాకీగా నటిస్తూ అందర్నీ మెప్పించే రష్మిక లో ఇప్పటి వరకు బయటపడని యాక్టింగ్ స్కిల్స్ పూర్తిగా బయటకు వస్తే బన్నీ పాత్ర రష్మిక పాత్రముందు ఫేడ్ అవుతుందా అంటూ ఈ వార్తలు విన్న బన్నీ అభిమానులు భయపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను విలన్ రోల్ కోసం సునీల్ శెట్టి మరో కీలక పాత్ర కోసం కన్నడ హీరో  ధనంజయ్ ని ఎంపిక చేసిన సుకుమార్ ఈ మూవీని అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూవీలోని ప్రతి సీన్ లోను తన మార్క్ కనిపించేలా ఈ లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా ‘పుష్ప’ కోసం వినియోగిస్తున్నాడు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: