నా అమ్మా నాన్న ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. ఇది దర్శకుడు కరుణాకరన్ అనే మాట.. ఒక మనిషిలో పూసంతైనా పుణ్యం చేసుండకపోతే శివుడు పిలవడు అని సీతారామ శాస్త్రి గారు చెప్పారని.. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఇంతమంది ఆయన్ను ఎందుకు ప్రేమిస్తారు. ఈయన బహుశా నిలువెత్తు మంచితనం అయ్యుంటుంది.. అందుకే ఇంతమంది అభిమానులు ఉన్నారు.. ఇంతమంది ప్రేమించేవారు ఉన్నారు.. ఇది డబ్బులిస్తే వచ్చే ప్రేమ కాదు.. మీరంతా పిలిస్తే వచ్చే వాళ్ళు కాదు.. మీకు రావాలనిపిస్తేనే వస్తారు.. పవన్ కళ్యాణ్ కోసమే వస్తారు.. మీరు రావాలనిపించేలా బ్రతికే మనిషి కాబట్టి ఆయన్ను చూడటానికి వస్తారు అంటూ పవన్ గురించి ఒక ఈవెంట్ లో అన్నారు త్రివిక్రమ్. 

 

పవర్ స్టార్ అనగానే ఆంద్ర దేశమే కాదు తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ ప్రకంపణలు వెళ్తాయని అన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. చేయి ఎత్తగానే జనం ఆగిపోయే శక్తి కోట్లలో ఒకడికిస్తాడు దేవుడు.. ఇటు వైపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని ఆలోచించకుండా వెళ్లే ప్రేమా.. అభిమానం.. సంపాదించుకునే ఆస్తి ఎక్కడో కోట్లలో ఒకడికి ఉంటుంది. అలంటి కోట్లలో ఒక్కడు ఈయన. పవన్ కళ్యా ఒక మర్రిచెట్టు..నీడ కావాల్సిన వారికి నీడనిస్తాడు అంటూ త్రివిక్రమ్ మరో ఈవెంట్ లో చెప్పారు. అంతా కలిపి ఇంతే కావొచ్చు.. కానీ ఒక్కసారి తలెత్తి చూస్తే ఒక దేశపు జండాకు ఉన్నంత పొగరు ఉంది. ఆయన గొంతెత్తితే ఒక గొంతు కాదు కొన్ని కోట్ల మంది కలిసిన ఒక గొంతుక ఇలా త్రివిక్రమ్ పవన్ గురించి మాట్లాడుతారు. 

 

పవన్ గురించి మాట్లాడేటప్పుడు త్రివిక్రమ్ మాట్లాడే తీరు పవర్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది పవన్ గురించి చెప్పాలంటే అది త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా అనేలా ఆయన మాటలు ఉంటాయి. త్రివిక్రమ్ అయితే అందమైన మాటలతో చెబుతాడు.. కానీ అలా మాట్లాడలేని చాలామంది పభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమని గుండె నిండా నింపుకుని ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పటికి పవర్ స్టారే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: