మళ్ళీ రావా సినిమా చూస్తే లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి బాగా దగ్గరవుతుంది... వావ్ .. నిజంగా ఈ స్టోరీ ఎంత బాగుంది అనిపిస్తుంది. అంతేకాదు.. ఈ సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా చుసిన అనంత సేపు మనసుకు ఏదో మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి అంటే నమ్మండి.. అలాంటి అద్భుతమైన డైలాగ్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

1. గౌరవం అంటే ఆధార కార్డు లాగ అందరికి వచ్చేది కాదు, క్రెడిట్ కార్డు లాగా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. 

 

2. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఇష్టపడటం, దూరమైనప్పుడు బాధపడటం ఇంతకుమించి నాకేం తెలియదు అంజలి. 

 

3. నేను ప్రేమ వల్ల గుర్తున్నానా? ద్వేషం వల్ల గుర్తున్నానా ? ఆ రెండో మాట తలుచుకుంటే భయమేస్తుంది. 

 

4. జీవితంలో చేతగాని ప్రతి వాడు చెప్పే మాటే ఇది- ఎవడో మోసం చేసాడని. 

 

5. 14 ఏళ్లకే మీ ఐఐటీ ప్రిపేర్ అవుతుందనో, కప్ గెలుచుకుండానో, క్లాస్ ఫస్ట్ వచ్చిందనే చెప్తే బాగుంటుంది. కానీ ఇంకో అబ్బాయిని ఇష్టపడుతుంది అని చెప్తే చాల చాలా అసహ్యంగా ఉంటుంది. 

 

6. పెళ్లి చేసుకోవాల్సింది పెళ్ళికి ముందు ఎం జరిగింది అన్న సమాధానంతో కాదు, పెళ్ళికి తర్వాత ఎలా ఉండాలన్న ప్రశ్నతో.. 

 

7. తను న్నను గుర్తుపట్టలేదా, గుర్తు కూడా లేనా ? ఆ రెండో మాట తలుచుకుంటే భయమేస్తుంది. 

 

8. ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకోనన్నప్పుడు ఎందుకు అని ఒక్క మాట కూడా అడగలేదంట.. ఒక ఆడపిల్లను ఇంతకంటే ఎక్కువగా ఎవరు అర్ధం చేసుకోగలరు.. 

 

9. నాకోసం సిగరెట్ మానేస్తావా.. అడిగి చూడు.. అడగను నాకు ఆ మాట చాలు. 

 

10. చిన్నప్పటినుంచి లవ్ కాదు రా.. తనని చూస్తుంటే ఇష్టం కాదు, ప్రేమ కాదు, ఆనందం కాదు.. ఆ క్షణంలో ఏమనిపిస్తుందో గుర్తు కూడా ఉండదు. 

 

ఇవి అండి డైలాగ్స్.. చెప్పినప్పుడు హీరో, హీరోయిన్ ఎలా చెప్పరో కానీ.. రాసేప్పుడు నాకు మాత్రం అదో అద్భుత ఫీలింగ్ వచ్చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: