కరోనా వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా విళయతాండవ చేస్తుంది.  ప్రపంచంలో ఇప్పటివరకు 26 లక్షల 21 వేల 436 మందికి కరోనావైరస్ సోకింది.లక్షా 82 వేల 989 మంది మరణించారు. ఏడు లక్షల 14 వేల 319 మంది కోలుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వివిద దేశాల్లో కేసులు, మరణాలు ఇలా ఉన్నాయి. ఇక మన దేశంలో మొత్తం 21,393 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేసుల సంఖ్య 1409 పెరగడం గమనార్హం. మొత్తం 681 మంది చనిపోగా, 4258 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.  

 

ఇక సినీ పరిశ్రమ విషయానికి వచ్చేసరికి కరోనా కట్టడిలో భాగంగా ముందుగా ధియేటర్ లను మూసివేసారు. అయితే ఇప్పుడు ధియేటర్ లను ఎప్పుడు తెరుస్తారు అన్నది సగటు అభిమాని ప్రశ్న.. అయితే లాక్ డౌన్ మే నెలాఖరు వరకు వుంటుందని తెలుస్తోంది.  ఈ మద్య దర్శకధీరుడు రాజమౌళి అయితే ఏకంగా సినిమా థియేటర్లో మరో ఆరు నెలలు పట్టేలా ఉందని చెప్పకనే చెప్పారు.  కరోనా ప్రభావంతో సనసమూహానికి అడ్డుకట్ట వేస్తున్నారు.  ఇప్పటికే సోషల్ డిస్టెన్స్ ఉండాలని ఆజ్ఞలు ఉన్నాయి.. గుంపులుగా ఉండటం నిషేదం.. దాంతో షాపింగ్ మాల్స్, థియేటర్లు ఖచ్చితంగా జనసమూహం ఉంటుంది..అలాంటపుడు కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతుందని అంటారు.

 

అయితే జూన్ 15 తరవాత తెరిచే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నుంచి వస్తున్న మాట.. కానీ అల తెరిచినప్పటికి ఎలాంటి లాభం లేదనేది మరో వాదన జరుగుతుంది.  ఇలాంటి సమయంలో ధియెటర్లను తెరవడం వృధా అని ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో మాట. అయితే జూన్, జూలై, ఆగష్టు స్కూళ్లు, కాలేజీల హడావుడి ఉంటుంది.  థియేటర్లు తెరుచుకున్నా, లేకపోయినా ఒకటే. దాంతో విజయదశమి థియేటర్ల ఆరంభానికి బెటర్ అన్న మాటలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా మే 7 తర్వాత లాక్ డౌన్ పరిస్థితి ని బట్టి తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: