తెలుగు సినిమాల్లో చిరంజీవి మేనరిజమ్స్, డైలాగ్ డిక్షన్, యాక్షన్.. అంతా కలిపి చిరంజీవికి మెగాస్టార్ ను చేశాయి. అదే మాస్ ఇమేజ్ తో మూడు దశాబ్దాలకు పైగా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలుతున్నాడు. అయితే.. చిరంజీవికి మాస్ ఇమేజ్ రాకముందు క్లాస్ మూవీస్ చేశాడు. అందులో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ఒకటి. ఈ సినిమా విడుదలై నేటితో 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 1982 ఏప్రిల్ 23న విడుదలయింది.

IHG's tweet -

 

దర్శకుడిగా కోడి రామకృష్ణకు ఇదే తొలి సినిమా. భార్యభర్తల గిల్లికజ్జాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. చిరంజీవికి జోడీగా మాధవి నటించింది. గడుసు భార్యకు బుద్ధి చెప్పే భర్తగా చిరంజీవి అద్భుతంగా నటించారు. పూర్ణిమ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అప్పటివరకూ రచయితగా మంచి పేరు తెచ్చుకున్న గొల్లపూడి మారుతీరావుకు నటుడిగా ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించారు. అప్పట్లో ఈ సినిమా అద్భుత విజయం సాధించి శతదినోత్సవంతో పాటు హైదరాబాద్ లో ఏకంగా 365 రోజుల పాటు ఆడింది. జెవీ రాఘవులు సంగీత సారధ్యంలో సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

IHG

 

ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.రాఘవ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు కూడా చిరంజీవి దగ్గరయ్యారు. దర్శకుడిగా కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత కొడి రామకృష్ణ తెరకెక్కించిన తరంగిణి సినిమా కూడా ఏడాది పాటు ఆడింది. ఈ రెండు సినిమాలతో కోడి రామకృష్ణ తిరుగులేని దర్శకుడిగా మారిపోయారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి చిరంజీవికోడి రామకృష్ణ కెరీర్లో క్లాసికల్ మూవీగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: