చిరంజీవి తమ్ముడిగా పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ గా ఎదిగాడు. రాజకీయంగా కూడా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారాను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. అయితే.. ప్రజారాజ్యం పార్టీ ఇద్దరికీ చేదు అనుభవాల్నే మిగిల్చింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాలు చేస్తున్న చిరంజీవి ఇక్కడ మాత్రం తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్లో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మెగాస్టార్. ఈ సందర్భంగా రాజకీయంగా పవన్ గురించి, పర్సనల్ అటాచ్ మెంట్ గురించి వివరించారు.

 

 

‘పవన్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉంటున్నాడు. రాజకీయంగా మా దారులు వేరైనా గమ్యం ఒకటే. ఏదొక రోజు పవన్ అనుకున్నది సాధిస్తాడు. ప్రజారాజ్యం పార్టీ అనుభవాల నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆ అనుభవంతో జనసేన పార్టీని నడిపిస్తున్నాడు. నాతో పాటు మా కుటుంబ సభ్యులందరి మద్దతు జనసేనకు ఉంటుంది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వస్తాడు. అందరం కలిసి భోజనం చేస్తాం. రాజకీయంగా ఏమీ మాట్లాడుకోం. నేను కూడా ఎటువంటి సలహాలు ఇవ్వను. తను కూడా ఏమీ చెప్పడు. అమ్మతో మాట్లాడుకుంటూ కుటుంబ విషయాలు చర్చించుకుంటాం. సరదాగా టైమ్ స్పెండ్ చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.

 

 

ఇంకా చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా వయసు 64 ఏళ్లు. ఈ వయసులో మళ్లీ రాజకీయాల వైపు వెళ్లడం అంత సామాన్యమైన విషయం కాదు. రాజకీయంగా నేను చేయాల్సినదంతా గతంలోనే చేశాను. కేంద్ర మంత్రిగా పర్యాటకంలో కాన్ని మార్పులు తీసుకొచ్చాను. విదేశఆల్లో ఉండే భారతీయులకు ‘ఆన్ అరైవల్ వీసా’ ను అమలులోకి తీసుకురావడంలో మంత్రిగా కృషి చేశాను. ఇప్పుడు రాజకీయంగా ఎటువంటి ఆలోచనలు లేవు’ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి రాజకీయంగా తన ఆలోచనలు, జనసేనపై తన అభిప్రాయాలను మెగాస్టార్ రివీల్ చేశారని చెప్పాలి.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: