యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పే డైలాగుల‌కు తెలుగు సినిమా రంగంలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. డైలాగులు చెప్పాలంటే దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, న‌ట సౌర్వ‌హ‌భౌమ ఎన్టీఆర్‌కు ఎన్టీఆరే సాటి. ఆ త‌ర్వాత ఆయ‌న సినీ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య పౌరాణికం, సాంఘీక , జాన‌ప‌ద ఇలా ఏ క‌థ‌లో అయినా ఇమిడి పోయే హీరోగా పేరు తెచ్చుకున్నాడు. యాక్ష‌న్ సినిమాల్లో బాల‌య్య‌ను కొట్టేసిన తెలుగు హీరోయే లేడు. ఫ్యాక్ష‌నిజం సినిమాల‌కు బాల‌య్య కేరాఫ్ అయ్యారు.

 

ఇక స‌మ‌ర‌సింహా రెడ్డి అయినా న‌ర‌సింహా నాయుడు అయినా భైర‌వ‌ద్వీపం, దాన‌వీర శూర క‌ర్ణ ఇలా ఏ సినిమాలో అయినా బాల‌య్య చెప్పే డైలాగుల‌కు థియేట‌ర్ల‌లో విజిల్స్ ఆగ‌వు. సినిమా క‌థ ఏదైనా కావొచ్చు.. రిజ‌ల్ట్ ఎలా ఉన్నా బాల‌య్య డైలాగులు బాంబుల్లా పేలుతాయి. బాల‌య్య - వివి. వినాయ‌క్ కాంబోలో వ‌చ్చిన చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా 2002లో వ‌చ్చింది. వినాయ‌క్ ఆది సినిమా తెర‌కెక్కించాక తీసిన ఈ సినిమా అప్ప‌ట్లో చిరంజీవి ఇంద్ర సినిమాకు పోటీగా వ‌చ్చింది. 

 

సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాల‌తో పోలిస్తే స‌రిగా ఆడ‌లేదు. అప్ప‌ట్లో ఈ సినిమా 155 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన చెన్న‌కేశ‌వ రెడ్డి 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాలో డైలాగులు మాత్రం అదిరిపోయాయి. స‌త్తిరెడ్డి అని బాల‌య్య అర‌వ‌గానే వెన‌క టాటా సుమోలు గాల్లోకి లెగ‌డం.. హైలెట్‌. ఈ డైలాగులో చెప్పుకోవ‌డానికేం లేక‌పోయినా బాల‌య్య స‌త్తిరెడ్డి అని అరిచిన వెంట‌నే సీన్ ఒక్క‌సారిగా థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లి న‌ట్టు ఉంటుంది. 

 

ఇక బాల‌య్య వ‌య‌స్సు పెరిగినా డైలాగుల్లో ప‌దును మాత్రం త‌గ్గ‌డం లేదు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో దేశం అడుగున బ‌తికే బ‌డుడు జాతికి ఇంత రోశ‌మా ? అని ప్ర‌త్య‌ర్థి రాజు అన్న‌ప్పుడు బ‌డుగు జాతి కాదు తెలుగు జాతి సువిశాల దేశాన్ని పునాదుల‌పై మోస్త‌న్న ధీరులం వేద‌భూమి వేరులం అని బాల‌య్య చెప్పే డైలాగ్‌కు హ్యాట్సాఫ్ అనాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: