టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నట వారుసులు సినీ రంగ ప్రవేశం చేశారు.  సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత వారి వారసులు బాలకృష్ణ, నాగార్జున హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఇదే సమయంలో స్టార్ ప్రొడ్యుసర్ డి రామానాయుడు తనయుడు వెంకటేష్ కూడా కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.  ఆయన సోదరుడు డి సురేష్ బాబు మాత్రం స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ఆయన తనయుడు రానా యంగ్ జనరేషన్ హీరోగా కొనసాగుతుతున్నారు.  నిర్మాతగా డి సురేష్ బాబుకి  అపారమైన అనుభవం వుంది. అలాంటి సురేశ్ బాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

 

తాను సినిమాల్లోకి రావాలని ఎప్పుడు భావించలేదని.. అదే సమయంలో తన సోదరుడు వెంకటేష్ సినీమా హీరోగా మారగానే ఎంతో ఎంకరేజ్ చేశానని అన్నారు. ఆ సమయంలో నన్ను కూడా హీరోగా మారమని చాలా మంది సలహాలు ఇచ్చారు.  మంచి వయసులో ఉండగా నేను కమలహాసన్ లా ఉండేవాడిని. మరో విచిత్రం ఏంటంటే.. కమల్ హాసన్ కారు .. నా కారు ఒకే రకమైనవి. అందువలన నేను ఆ కారులో వెళుతుంటే కమల్ అనుకుని అభిమానులు నా కారు ఆపేసేవారు. కొన్ని సార్లు అభిమానులు వెంట కూడా పడ్డారు.  అంతే కాదు అప్పట్లో భారతీరాజా గారు నాతో ఓ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఆయన ఆఫర్ ను నేను సున్నితంగా తిరస్కరించాను.

 

 నాకు మొదటి నుంచి నటన కన్నా నిర్మాణ రంగపైనే ఎక్కువ దృష్టి ఉండేది. నాన్నగారు సినీ రంగంలో మంచి నిర్మాత గా కొనసాగతారు.. ఆయన బాధ్యతలు ఎక్కువగా చూసుకోవడం వల్ల నేను కూడా నిర్మాణ రంగం వైపే మొగ్గు చూపానని అన్నారు. మొదటి నుంచి కూడా నాకు నటన పట్ల ఆసక్తి ఉండేది కాదు. అందువలన నటనకు దూరంగానే వుండిపోయాను. బిజినెస్ వ్యవహారాల పట్లనే మక్కువ ఎక్కువగా ఉండేది. అందువల్లనే నిర్మాతగా స్థిరపడ్డాను" అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: