రజని కాంత్ సినిమాలు అనగానే మన తెలుగులో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది జనాలకు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన తో సినిమా చేయడానికి గానూ ఎందరో దర్శక నిర్మాతలు మన తెలుగులో కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక మన ప్రేక్షకులు కూడా తెలుగులో రజని సినిమా వస్తుంది అంటే చాలు పనులు పక్కన పెట్టుకుని మరీ చూసే పరిస్థితి ఉంటుంది. టాలీవుడ్ జనాలు ముందు గానే టికెట్ ని బుక్ చేసుకుని చూసే పరిస్థితి ఉంటుంది. 

 

అయితే ఈ మధ్య కాలంలో రజని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఒక్కటి అంటే ఒక్కటి కూడా కూడా హిట్ అయిన పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి. దీనిపై రజని కాంత్ కూడా కాస్త అసహనంగానే ఉన్నారు అనేది టాలీవుడ్ జనాల మాట. ఆయన మార్కెట్ తెలుగులో భారీగా పడిపోయింది. ఆయనతో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఈ తరుణంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనే వార్త వస్తుంది. ఆయన ఒక స్టార్ హీరో తో తెలుగులో సినిమా చేయడానికి గానూ ఆసక్తి చూపిస్తున్నారని టాక్. 

 

హీరో ఎవరో కాదు రామ్ చరణ్ అని అంటున్నారు. రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట రజని. తాన కుమార్తె నిర్మాత గా తెలుగులో నే ప్రత్యేకంగా ఒక సినిమా చేయడానికి రజని కాంత్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అటు ఆయన అల్లుడు ధనుష్ కూడా మన తెలుగులో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎప్పుడు టాలీవుడ్ లో వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: