కరోనా వైరస్ కంటే బలవంతురాలు ఎవరూ లేరని ఇపుడు అంతా ఒప్పుకుంటారు. ఎందుకంటే కరోనా కాఠిన్యం ఏంటో ప్రపంచం ఈ రోజు చూస్తోంది. మొత్తం మానవాళిని ఇంట్లొ కూర్చోబెట్టేసింది.మన మేధస్సు. మన తెలివి తేటలు, మన సాంకేతిక నైపుణ్యం అన్నీ కూడా ఎందుకూ పనికిరావు అనిపించేస్తోంది. ప్రాణ భయంతో అరచేతులు పట్టుకుని మానవాళి మొత్తం దీనంగా నిలబడి  ఉంది.

 

ఆ విధంగా కరోనా ఓ వైపు బతుకు భయం కలిగిస్తోంది. మరో వైపు ఇదే కరోనా అన్ని రంగాలను తల్లకిందులు చేస్తోంది. బతికి ఉన్నా కూడా ఇదివరకులా బతకడం కష్టమని చాటి చెబుతోంది. ఇక టాలీవుడ్లో కూడా కరోనా భయం ఎక్కువగా ఉంది. ఇప్పటికే సినిమాలు ఎలా అని తల్లడిల్లుతున్నారు.

 

ఇంకో వైపు కధలు రాసుకుని కొంత షూటింగ్ చేసుకున్న సినిమాల కధలను కూడా కరోనా మహమ్మారి మార్చేస్తోంది. వారి లోకేషన్లు కూడా మొత్తం చేంజ్ చేసేస్తోంది. ప్రభాస్ జాన్ మూవీ విదేశాల్లో షూట్ చేయాల్సి ఉంది. ఇపుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తేసినా కూడా షూటింగ్ బయట చేయడం కష్టం. దాంతో స్టూడియోలోనే సెట్టింగులు వేసి కాస్తా మార్పులు చేర్పులు కధలో కూడా చేసి చేసుకోవాలిట.

 

అదే విధంగా చూసుకుంటే బాలయ్య, బోయపాటి కాంబోలో మూవీకి కూడా కరోనా కష్టాలు మొదలయ్యాయి. ఈ మూవీ కధ ప్రకారం కాశీలో తీయాలి. కానీ ఇపుడు కాశీకి వెళ్ళి షూట్ చేఏ పరిస్థితి లేదు. అక్కడ పర్మిషన్లు కూడా ఇవ్వరు. దాంతో ఉన్నంతలో ఏపీలోనే చేయాలి. అది కూడా కధలో మార్పు చేసుకుని చేయాలి. దాంతో ఈ సినిమాకు ప్రాణం లాంటి వారణాసి ఎపిసోడ్ లేకుండా కధ మార్చి చేస్తే రిస్కే అని యూనిట్ మల్లగుల్లాలు పడుతోందిట.

 

 మొత్తానికి ఇదే రకమైన బాధ మిగిలిన సినిమాలకు కూడా ఉన్నాయట. మొత్తం మీద కరోనా మనుషుల రాతలను మార్చేసింది. సినిమాల కధలను కూడా మార్చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: