లాక్ డౌన్ లో సల్లూ భాయ్ రొమాంటిక్ బాయ్ గా మారిపోయాడు. కరోనా క్వారంటైన్ ని అంతా స్ట్రెస్ లా ఫీలవుతుంటే కండలవీరుడు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. లాంగ్ క్వారంటైన్ లో సల్మాన్ ఖాన్ కు గాళ్ ఫ్రెండ్స్ తో టైమ్ పాస్ అవుతోంది. 

 

ఏది ఏమైనా ప్రపంచం తలకిందులైనా.. సినిమా స్టార్స్ కు బోర్ అనేదే లేదని అర్థమవుతోంది. కరోనా లాక్ డౌన్ కి ఒక్కో సినీ సెలబ్రెటీ ఒక్కో విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు వర్కవుట్ తో టిక్ టాక్ లతో కాలక్షేపం చేస్తుంటే.. కొందరు ఇంట్లో వైఫ్ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ రొమాంటిక్ లవర్ బాయ్ లా మారిపోయాడు. గాళ్ ఫ్రెండ్స్ తో పిచ్చాపాటి టైమ్ పాస్ చేస్తున్నాడు. 

 

బాలీవుడ్ కండల యాక్టర్ సల్మాన్ ఖాన్ రొమాంటిక్ వేషాల గురించి చెప్పాల్సిన పనేలేదు. ఈ ముదురు బ్యాచిలర్ ఫుల్ స్టాప్ అనేదే లేకుండా లవ్ ఎఫైర్స్ నడిపేస్తున్నాడు. మొన్నటికి మొన్న లాక్ డౌన్ లో జాక్విలైన్ ఫెర్నండేస్ సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్న విషయాన్ని ఓ ఫోటో షేర్ చేసి రివీల్ చేశాడు. ఇప్పుడు రష్యన్ బ్యూటీ ఫ్రెండ్ లూలియా వాంటూర్ కూడా సల్లూబాయ్ ఇంట్లోనే ఉందనే తెలిసింది. సోషల్ మీడియాలో లూలియా ఇస్తున్న లైవ్ లో సల్మాన్ ఖాన్ వెనుక నుండి తళుక్కున మెరిశాడు. ఈ బ్యూటీ అక్కడ ఎవరెవరు.. ఎలా స్పెండ్ చేస్తున్నారు అనే విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంది. 

 


సల్మాన్ ఖాన్, రష్యన్ బ్యూటీతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ మొత్తం ఫిజికల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తుంటే సల్మాన్ ఖాన్ మాత్రం లాక్ డౌన్ ను రొమాంటిక్ డేస్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం సల్లూభాయ్ రొమాన్స్ బీటౌన్ లో హాట్ టాపిక్ అవుతోంది. ముంబైలోని పన్వేల్ ఫామ్ హౌస్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. లూలియా వాంటూర్ లతో చెల్లెలు.. మేనల్లుడుతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ నెటిజన్లు ఇక దొరికిందే సందు అని జోరుగా హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ప్రభుదేవా డైరెక్షన్ లో రాధే సినిమాలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: