తెరపై హీరోలుగా ఎదిగి క్రేజ్ సంపాదించుకున్న ఎంతో మంది అద్భుత నటులు తమ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఆదర్శాలకు తిలోదకాలిచ్చేశారు. 
ఏకపత్నీ వత్రం పాటించిన రాముడి అడుగుజాడల్లో వారు నడవడం లేదు. త‌మ టాలెంట్‌తో అచేతు హిమాచ‌లాన్ని ట‌చ్ చేసినా ప‌ర్స‌న‌ల్ విష‌యాల్లో మాత్రం కాంప్రమైజ్ కాలేక‌పోయారు. త‌మ వైవాహిక జీవితంలో త‌మ‌ది త‌ప్పో లేదా త‌మ భాగ‌స్వామిది త‌ప్పో గాని తొలి వైవాహిక జీవితాన్ని వ‌దులుకుని మ‌రో అమ్మాయిని లేదా అబ్బాయిని మ‌నువాడ‌డంతో రెండో వైవాహిక జీవితం ఆరంభించిన వాళ్లు చాలా మంది సెల‌బ్రిటీలు ఉన్నారు. ఈ జాబితాలోకే
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వ‌స్తారు.

 

ప్ర‌కాశ్ రాజ్ ఏకంగా రెండున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా సినిమాల్లో ఉన్నారు. ఆయ‌న ద‌క్షిణాదిలో అన్ని భాష‌ల్లో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇంకా చెప్పాలంటే హీరోల‌ను మించిన అభిమానం ఆయ‌న సొంతం కూడా. అటు క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళ్‌, మ‌ళ‌యాళ భాష‌ల‌న్నింటిలోనూ న‌టించారు. హీరోగా, విల‌న్‌గా, హీరో తండ్రిగా, హీరోయిన్ తండ్రిగా... క్యారెక్ట‌ర్ న‌టుడిగా .. అత్యంత క్రూర‌మైన విల‌న్‌గా ఇలా ఎన్నో పాత్ర‌ల్లో న‌టించి మెప్పించాడు. ఇంకా చెప్పాలంటే ప్ర‌కాష్ రాజ్ కు ఈ త‌రం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో పోటీ ఇచ్చే వారు ఎవ్వ‌రూ లేరంటే అతిశ‌యోక్తి కాదు.

 

అయితే ప్ర‌కాష్ రాజ్ వైవాహిక జీవితం అంత సాఫీగా సాగ‌లేదు. ప్ర‌కాష్ రాజ్ మొదట లలితా కుమారీని పెళ్లి చేసుకున్నాడు.. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిళ్ల‌లు కూడా పుట్టారు. 15 ఏళ్ల తర్వాత 2009లో డైవర్స్ ఇచ్చాడు. అయితే అప్ప‌టికే అత‌డు డ్యాన్స్ మాస్ట‌ర్ అయిన పోనీ వ‌ర్మ‌తో డేటింగ్‌లో ఉన్నాడు. ప్ర‌కాష్ రాజ్ పోనీ వ‌ర్మ ఎఫైర్ విష‌యం ఆయ‌న ఇంట్లో తెలియ‌డంతో నే చివ‌ర‌కు ల‌లితా కుమారి - ప్ర‌కాష్ రాజ్ విడిపోవ‌డానికి కార‌ణ‌మైంద‌ని అంటారు. ఇంత‌కు ల‌లితా వ‌ర్మ ఎవ‌రో కాదు డిస్కో శాంతికి అక్క‌. దివంగ‌త శ్రీహ‌రి - ప్ర‌కాష్ రాజ్ తోడ‌ళ్లుళ్లు అవుతార‌న్న‌మాట‌.  ఇక 2010లో కొరియోగ్రాఫర్ 'పోనీ వర్మా' ని పెళ్లి చేసుకున్నాడు ప్ర‌కాష్‌. ఇప్పుడు వీరికి ఒక కుమారుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: