ప్రేమ పెళ్లి ఈ రెండు పదాలు మన తారలకు తరచూ పరిచయం అయ్యాయి. డ్రెస్సు మార్చినంత ఈజీగా భార్య లేదా భర్తలను మార్చిన నటులు నటీనటులు మన ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా రంగం అనేది గ్లామ‌ర్ ఫీల్డ్‌. ఈ రంగంలో ఎఫైర్లు.. ఆక‌ర్ష‌ణ‌లు చాలా కామ‌న్‌గా న‌డుస్తూ ఉంటాయి. ఎవ‌రు ఎప్పుడు ఎవ‌రితో ఆక‌ర్ష‌ణ‌లో ప‌డ‌తారో ? ఈ బంధం ఎన్ని రోజులు ఉంటుందో ?  వీరి అవ‌స‌రాలు తీరిపోయాక ఎప్పుడు విడిపోతారో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

 

ఇక ఈ విష‌యంలో హీరోలే కాదు హీరోయిన్లూ అంతే.  తమకంటే ఎంతో చిన్నవారైన వారిని పెళ్లి చేసుకొని బిడ్డలను కన్న ప్రముఖ తారలు ఉన్నారు. రోమాన్స్ కు వయసుకు మధ్య అసలు సంబంధం లేదని వారు నిరూపించారు. అగ్రహీరోలు హీరోయిన్లుగా ఎదిగిన తారలు చాలామంది సినిమాల్లో నటిస్తూ ప్రేమలో పడి భార్యను వదిలేసిన వాళ్లు ఉన్నారు. మొగుళ్లకు విడాకులు ఇచ్చిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే సినిమా వాళ్ల‌లో అంద‌రిని ఒకే గాటిన క‌ట్ట‌లేం. కొంద‌రు కొన్ని చిన్న కార‌ణాల‌కే విడిపోతూ ఉంటారు.

 

ఈ లిస్టులోకే చేర‌తారు అక్కినేని మ‌న‌వ‌డు యార్ల‌గ‌డ్డ సుమంత్ - ఒక‌ప్ప‌టి ప్ర‌ముఖ న‌టి కీర్తిరెడ్డి. ప్రముఖ అక్కినేని కుటుంబ హీరో సుమంత్ కూడా విడాకులు తీసుకున్నాడు. ప్రేమించి మరీ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నా వీరు కలిసి ఉండలేకపోయారు. వీరి ప్రేమ .. పెళ్లి అప్ప‌ట్లో హైలెట్‌. వీరు పెళ్లి చేసుకోవ‌డం కూడా చాలా మంది ఇండ‌స్ట్రీ వాళ్లు హ్యాపీగా ఫీల‌య్యారు. అయితే కీర్తిరెడ్డిది పొలిటిక‌ల్ ఫ్యామిలీ. నిజామాబాద్ మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి మ‌న‌వ‌రాలు. వాళ్ల‌ది వెల్డ్ సెటిల్డ్ కుటుంబం. అమెరికాలో కోట్లాది రూపాయ‌ల వ్యాపారాలు ఉన్నాయి.

 

పెళ్ల‌య్యాక ఇండ‌స్ట్రీని వ‌దిలేసి అమెరికా వెళ్లిపోదాం అని కీర్తిరెడ్డి సుమంత్‌కు చెప్పినా విన‌లేద‌న్న టాక్ ఉంది. అంత‌కు మించి వీరి మ‌ధ్య వేరే బ‌ల‌మైన కార‌ణాలు కూడా ఉన్న‌ట్టు లేవు. పెళ్ల‌య్యాక యేడాదికే మ‌న‌స్ప‌ర్థ‌లు ఆ వెంట‌నే విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ప్ర‌స్తుతం ఆమె అమెరికాలో సెటిల్ అయ్యింది. సుమంత్ మాత్రం ఇక మళ్లీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: