టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్, ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టి అప్పట్లో సూపర్ స్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను తన ఆకట్టుకునే అందం, నటనతో ఎంతో ఆకర్షించారు. ఇక ఫస్ట్ సినిమాతోనే మహేష్ ప్రభంజనం ఎటువంటిదో చెప్పడానికి ఒక నిదర్శనం ఏమిటంటే, విజయవాడలో ఎంతో పేరెన్నికగన్న థియేటర్ అయిన అలంకార్ లో అప్పట్లో రాజకుమారుడు సినిమా ఏకంగా 100 రోజుల పాటు 4 షోలు కూడా ఫుల్ రన్ సాధించింది అంటే సూపర్ స్టార్ స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఆ రికార్డు మరొక నటుడైన నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాకు మాత్రమే ఉంది. ఆ తరువాత మురారి సినిమాతో సిల్వర్ జూబిలీ కొట్టిన సూపర్ స్టార్, ఆపై టక్కరి దొంగ వంటి వైవిద్యభరితమైన సినిమాలో నటించి, టాలీవుడ్ లో తండ్రి కృష్ణ తరువాత మరెవ్వరూ తన వలే వెరైటీ రోల్స్ చేయలేరు అని నిరూపించుకున్నారు. 

IHG'fear distancing' to avoid fake <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> about ...

ఆపై వచ్చిన ఒక్కడు సినిమా ఒక్కటి చాలు, అప్పట్లో ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు మరొక ప్రభంజాన్ని సృష్టించగా, ఆపై వచ్చిన పోకిరి సినిమా అతి పెద్ద హిట్ కొట్టడం జరిగింది. ఆ సినిమా సృష్టించిన రికార్డ్స్ ఇప్పటికీ కూడా చాలా ఏరియాల్లో ఏ మాత్రం చెక్కుచెదరకపోవడం, అలానే మరొక హీరో ఎవరూ కూడా దాని టచ్ చేయకపోవడం చాలు, సూపర్ స్టార్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆపై మధ్యలో కొన్ని ఫ్లాప్స్ తో పాటు మరికొన్ని విజయాలు అందుకున్న సూపర్ స్టార్, ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మూడు వరుస విజయాలు అందుకుని హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. ప్రస్తుతం ఒక్క పాన్ ఇండియా ఫిలిం కూడా చేయనప్పటికీ మహేష్ బాబు పేరు ఒక బ్రాండ్ గా మారి, ఇండియా మొత్తం మారుమ్రోగుతోంది. ఇక ఆయన ఎండార్స్ చేసే బ్రాండ్స్ విషయం చెప్పాలంటే మాటలు చాలవు. ఒకానొక సమయంలో థమ్స్ అప్ బ్రాండ్ కు కొన్నాళ్ల పాటు జాతీయ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించిన మహేష్ బాబు, ఇప్పటికీ ఎన్నేళ్లు గడిచినా, మరింత పెరిగిన ఇమేజ్ తో ఆ బ్రాండ్ తో పాటు మరెన్నో బ్రాండ్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. 

IHG

ఇక మహేష్ పేరు అటు సౌత్ లోని కన్నడ, తమిళ్, మలయాళ, తో పాటు నార్త్ లో కూడా విపరీతంగా మారుమ్రోగుతోంది. ఆయా భాషల్లో మహేష్ కు విపరీతమైన క్రేజ్ తో పాటు ఎందరో నటుల్లో వీరాభిమానులున్నారు. ముఖ్యంగా ఏకంగా కొందరు పెద్ద హీరోయిన్లు కూడా మహేష్ కు వీరాభిమానులు కావడం విశేషం. ఇక కొన్నేళ్ల క్రితం నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న మోస్ట్ డిజైరబుల్ మెన్ పోటీల్లో, ఒక సారి ఫస్ట్, మరోసారి సెకండ్, థర్డ్ తో పాటు ఇటీవల నాలుగవ స్థానంలో నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు, గత ఏడాది నుండి ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్ గా బాలీవుడ్ దిగ్గజ సూపర్ స్టార్స్ అయిన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ ల తరువాత మన సౌత్ నుండి ఆ స్థానం సంపాదించిన ఒక ఒక్క నటుడు గా ఎవరూ సాధించలేని రికార్డు ని సొంతం చేసుకున్నారు. ఇక ఎన్నో ఏళ్ళ క్రితమే తనకు బాలీవుడ్ అవకాశం వచ్చినప్పటికీ తాను మాత్రం తెలుగులో మాత్రమే నటిస్తానని ఇప్పటికీ కూడా చెప్పే మహేష్ కు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ నిజంగా వర్ణనాతీతం. అటు కోలీవుడ్ లో రజిని, కమల్, ఇటు మోలీవుడ్ లో మోహన్ లాల్, మమ్ముట్టి, శాండల్ వుడ్ లో పునీత్ రాజ్ కుమార్, సుదీప్ తదితరులందరికీ సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ ఇమేజ్ గురించి, క్రేజ్ గురించి తెలుసు. వాస్తవానికి మహేష్ బాబు తన కెరీర్లో పోకిరి తరువాత ఇప్పటివరకు మరొక మాస్, కమర్షియల్ సినిమా చేయలేదు అనే చెప్పాలి. 

IHG

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మీరు ఒక మంచి మాస్, కమర్షియల్ సినిమా చేస్తే ఎంతో ఈజీగా రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ వస్తాయి కదా అయినా మీరు ఎందుకు చేయడం లేదు అని, నేను శ్రీమంతుడు సినిమా సమయంలో మహేష్ గారిని అడిగానని నటి శృతి హాసన్ చెప్పడం జరిగింది. తన ప్రతి సినిమా ద్వారా ప్రేక్షకులకు ఎంతో కొంత వైవిధ్యాన్ని, అలానే మంచి అంశాన్ని అందించాలనే ఉద్దేశంతోనే తాను అటువంటి సినిమాలు చేయలేనని మహేష్ తనకు చెప్పారని శృతి అన్నారు. ముందు నుండి వివాద రహితుడిగా, తండ్రి వలె ఎందరికో తనవంతుగా వీలైనంత గుప్తదానాలు చేసే అలవాటున్న సూపర్ స్టార్, ఇటీవల రెండు గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు ఏకంగా వేయి మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి వారికి నూతన జీవితాన్ని అందించారు. ఒకరకంగా ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న స్టార్ హీరోల్లో మెగాస్టార్ తరువాత కుల, మాత, జాతి, వర్గ, వర్ణ, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అత్యున్నత స్థానం, పేరు, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో మహేష్ బాబు అని, ప్రస్తుతం ఆయన వరుస విజయాలు అందుకుంటూ తన క్రేజ్, మార్కెట్ ని మరింతగా పెంచుకుంటూ ఉండడంతో రాబోయే రోజులలో మరిన్ని గొప్ప శిఖరాలు అందుకుంటారని, ఆయన ఇమేజ్ కు ఆకాశమే హద్దు అని అంటున్నారు సినీ విశ్లేషకులు..... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: