నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు రెండవ కుమారుడైన అక్కినేని నాగార్జున మొదటగా 1986లో వచ్చిన విక్రమ్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే అంతకు రెండేళ్ల ముందే, అనగా 1984లోనే ఆయనకు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె అయిన లక్ష్మితో వివాహం జరిగింది. కాగా వారికి కుమారుడు అక్కినేని నాగచైతన్య జన్మించడం జరిగింది. 

IHG

ఆ తరువాత దాదాపుగా ఆరేళ్ళ పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్యంలో అప్పట్లో కొంత అనుకోని ఘటనల కారణంగా వారిద్దరి వివాహ జీవితంలో కొన్ని సమస్యలు మొదలయ్యాయని, అయితే వాటిని మరింతగా పెంచకుండా, ఇటు అక్కినేని ఫ్యామిలీ, అటు దగ్గుబాటి ఫ్యామిలీ రెండూ కూడా నాగార్జున కు లక్ష్మికి 1990లో విడాకులు ఇప్పించడం జరిగిందని సమాచారం. కాగా వాస్తవానికి నాగార్జునకు, ఆయన భార్యకు పెద్దగా వివాదాలేవి జరుగలేదని, వారిద్దరూ కూడా మొదటి నుండి ఎంతో కలిసిమెలిసి ఉన్నప్పటికీ, ఏవో కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా వారిద్దరూ విడిపోవడం జరిగిందని తెలుస్తోంది. ఇక ఆపై 1992లో అమలను ప్రేమించి వివాహం చేసుకున్నారు నాగార్జున. కాగా అనంతరం వారిద్దరికీ అక్కినేని అఖిల్ జన్మించాడు. 

 

ఇక మొదటి నుండి అమలతో కూడా ఎంతో అన్యోన్యంగా ఉండే నాగార్జున, మధ్యలో అప్పుడప్పుడు తన మొదటి భార్య లక్ష్మిని పలకరిస్తూనే ఉంటారని, ఇప్పటికీ కూడా వారిద్దరూ మంచి స్నేహితులని సమాచారం. అలానే ఆయన మొదటి భార్య కుమారుడైన నాగ చైతన్య, అమల కుమారుడైన అఖిల్ ఇద్దరూ ఎప్పుడూ కలిసి మెలిసి ఉంటారని, వారి ఫ్యామిలీ లో ఈ విషయమై ఎప్పుడూ కూడా ఎటువంటి పొరపచ్చాలు రావడం జరుగలేదని తెలుస్తోంది. అలానే తన సోదరి లక్ష్మి నుండి నాగార్జున విడిపోయినప్పటికీ, నాగార్జున, వెంకటేష్ ల మధ్య ఎప్పుడూ మంచి స్నేహం ఉంటుందని, వారు ఇప్పటికీ కూడా ఎంతో కలిసి మెలిసి ఉంటారని తెలుస్తోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: