టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ గా దాదాపు 350 పైగా సినిమాల్లో నటించిన నటశేఖర కృష్ణ, మొదటగా 1961లో శ్రీమతి ఇందిరా దేవిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారికి పద్మావతి,  రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని మొత్తం ఐదుగురు సంతానం. అయితే సినిమా ఇండస్ట్రీకి ప్రవేశించిన కొత్తలో కృష్ణ నటించిన సాక్షి సినిమా లో ఆయన సరసన విజయ నిర్మల హీరోయిన్ గా నటించారు. సినిమా తర్వాత కొద్దిరోజులకు వారిద్దరూ కూడా 1969లో వివాహము చేసుకోవడం జరిగింది. 

 

అయితే అప్పటికే విజయనిర్మల కుమారుడు నరేష్ కు జన్మనిచ్చి ఉన్నారు. అప్పట్లో విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకోవటం కొంత సంచలనం అయింది అనే చెప్పాలి. కాగా వారిద్దరి వివాహం పై అప్పట్లో పలు వార్తలు ప్రచారం అయినప్పటికీ వారి సన్నిహితులు మాత్రం వారి వివాహానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయని అంటుంటున్నారు. వాస్తవానికి కృష్ణ గారికి, అలానే విజయనిర్మల గారికి అప్పటికే విడి విడిగా వివాహాలు జరిగిపోయినప్పటికీ, సాక్షి సమయంలో వారిద్దరి మధ్య కొంత ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఆ తరువాత అది ప్రేమగా మారి వివాహానికి దారి తీసిందని సమాచారం. దానితో పాటు ఓ వైపు నటీనటులుగా కొనసాగుతున్న తామిద్దరూ కలిసి పని చేస్తున్న రంగం ఒక్కటే కావడంతో, ఈ రంగంలో ఒకరికొకరు తోడు నీడగా సాయం చేసుకోవచ్చనే ఉద్దేశ్యం కూడా ఉన్నట్లు సమాచారం. 

 

ఇక వీరి వివాహానంతరం, కృష్ణ భార్య పద్మావతిని విజయనిర్మల ఒక మంచి సోదరిలా ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని, అలానే ఆయన బిడ్డలను కూడా ఆమె ఎంతో ఆప్యాయంగా చూసుకునే వారని తెలుస్తోంది. అలానే మరోవైపు ఇందిరా దేవి కూడా విజయనిర్మలను ఎంతో గౌరవించేవారని, ఇక అటు కృష్ణ ఐదుగురు సంతానంతో పాటు ఇటు నరేష్ కూడా వారందరితో కలిసి మెలసి ఒకే కుటుంబంగా మొదటి నుండి కొనసాగడం జరిగిందని తెలుస్తోంది. ఇక నటిగా మంచి స్థాయికి చేరుకున్న అనంతరం, విజయనిర్మలను దర్శకురాలిగా మార్చడంలో కృష్ణ సహకారం ఎంతో ఉందని, అలానే నటుడిగా కృష్ణ మంచి ఉన్నత శిఖరాలకు ఎదగడానికి విజయనిర్మల అందించిన తోడ్పాటు కూడా ఎక్కువే అనేది తెలిసిందే. కాగా ఆ విధంగా మొదటి నుండి అందరూ కలిసి మెలిసి ఉండడంతో ఎప్పుడూ కూడా కృష్ణ గారి కుటుంబంలో ఎటువంటి వివాదాలు జరుగలేదని, అలానే కృష్ణ, విజయనిర్మలను రెండవ వివాహం చేసుకున్నప్పటికీ ఇద్దరు భార్యలను కూడా సమానంగా చూసేవారని తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: