కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా పడిన రంగాల్లో సినిమా రంగం కూడా ఉందన్న విషయం తెలిసిందే. ఖచ్చితంగా చెప్పాలంటే చిత్ర పరిశ్రమలో ఇలాంటి విపత్తును ముందెన్నడు ఎదుర్కోలేదు. అర్ధికంగా కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేయలేని విధంగా ఈ కరోనాతో ఆర్ధిక నష్టం వాటిల్లింది. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో కూడా చిత్ర పరిశ్రమలో ఉన్న ఎవరూ చెప్పలేకపోతున్నారు. రోజురోజుకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్ డౌన్ పీరియడ్ పెరిగే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొదట 21 రోజులుగా ప్రకటించిన లాక్ డౌన్ ని వచ్చే నెల వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని సినీ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. 

 

కరోనా ప్రభావం తగ్గి ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా జనాల్ని థియేటర్లకు రావడం అంత ఆషామాషి వ్యవహారం కాదని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. పెద్ద సినిమాలు కొంత వరకు సేఫ్ అయినప్పటికి.. చిన్న సినిమాల పరిస్థితే ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమలో చాలా మార్పులకు కారణం కాబోతోందని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారట. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలని డిజిటిల్ స్ట్రీమింగ్స్ లో విడుదల చేయాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు. అయితే అందుకు కొంతమంది హీరోలు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హీరోలకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు అంటున్నది కరెక్టే అన్న ధోరణిలో మాట్లాడుతున్నారట.
 

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాల విడుదలపై హీరోల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయన్న దాంట్లో నిజం లేదని... రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలు వెంటనే రిలీజ్ చేయకపోతే ఆ సినిమాలు చూడటానికి ఎవరు తర్వాత ఆసక్తి చూపించరని అందుకే హీరోలు కూడా వాళ్ల సినిమాలు ప్రేక్షకులకు చూపించడమే ముఖ్యం అనుకుంటారని... అది ఎక్కడన్నది ప్రధానం కాదు అని అన్నారట. అయితే సినిమాని థియేటర్లలో చూస్తే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. ఆ సౌండ్ విజువల్స్ థియేటర్లో గొప్ప అనుభూతినిస్తాయి. అందుకే మా 'వి' సినిమాని కొన్ని రోజులు వెయిట్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తామని అంటున్నాడు దిల్ రాజు. అయితే ఇక్కడ దిల్ రాజు మాటలు చూస్తుంటే కొంతమందికి తెలివిగా అనిపించిన అతి తెలివి అని అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: