మాస్ మహారాజా రవితేజ చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పనిచేస్తూ నటుడయ్యారన్న సంగతి అందరికి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన రవితేజ ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకుడిగా పరిచయమవుతూ రవితేజ ని హీరోగా పరిచయం చేస్తూ నీకోసం సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పట్లో కోటి రూపాయల వసూళ్ళని రాబట్టింది. అంతేకాదు మొత్తం 7 అవార్డులను అందుకుంది. ఈ సినిమా అందరికి లైఫ్ ఇచ్చింది. హీరోగా రవితేజ, హీరోయిన్ గా మహేfశ్వరికి, మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్ పి పట్నాయక్, దర్శకుడిగా శ్రీను వైట్ల కి ఇలా అందరూ బాగా పేరు సంపాదించుకున్నారు.

 

సినిమా చూసే శ్రీను వైట్ల కి అవకాశం ఇస్తానని రామోజీరావు తో పాటు అక్కినేని నాగార్జున మాటిచ్చారు. ఆ తర్వాత శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రవితేజ ఇలా స్టార్స్ తో సినిమాలు చేశాడు. ఇక హీరోగా రవితేజ కూడా స్టార్ గా ఎదిగాడు. ఎవరి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లో స్టార్ అయిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో అందరూ మన రవితేజ గురించే చెప్పుకుంటారు. అంతేకాదు ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు కూడా రవితేజని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు.

 

అయితే రవితేజ స్టార్ ఇమేజ్ నుంచి క్రమంగా తగ్గిపోతున్నాడని టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం ఆయన వరసగా ఫ్లాప్స్ ని ఎదుర్కోవడమే. కథ ఎలాంటిదైనా రవితేజ ఆటిట్యూడ్ ఒకేలా ఉంటుందన్న నెగిటివ్ టాక్ కూడా బాగా వినిపిస్తుంది. డిస్కో రాజా లాంటి సినిమాతో ప్రయోగం చేసినా అది వికటించింది. ఎప్పుడో రాజా ది గ్రేట్ సినిమా తో ఒక సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత మళ్ళీ తన ఫాం ని కోల్పోయాడు.

 

అందుకు కారణం కథల్లో కొత్తదనం లేకపోవడం. ఇలాంటి కథలని ఎంచుకునే రవితేజ పొరపాటు చేస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు యాక్టింగ్ లోను కొత్తదనం ఉండటం లేదని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ రెండు విషయాలు మారితే రవితేజ మళ్ళీ సక్సస్ ల బాట పట్టే అవకాశం ఉంది. ఇక త్వరలో క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు మాస్ రాజా.      

మరింత సమాచారం తెలుసుకోండి: