ఇటు తెలుగు అటు తమిళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి రాధిక. ఎన్నో విజయవంతమైన సినిమాలను ఎందరో అగ్ర హీరోల పక్కన చేసిన ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వివాదాలతో కూడా ఆమె అదే విధంగా సావాసాలు చేస్తూ ఉంటారు అని కూడా అంటారు. అందుకే ఆమె వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడ్డారని చెప్తారు. ఆమె జీవితం లో మూడు వివాహాలు చేసుకున్నారు ముందు ప్రతాప్ పోతన్ ని ఆమె 1985 లో వివాహం చేసుకుని సరిగా ఏడాదికే ఆయన నుంచి ఆమె విడిపోయారు. ఆ తర్వాత రిచర్డ్ హార్డీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 

 

ఈ వివాహం అప్పట్లో ఒక సంచలనం. కేవలం రెండేళ్ళ కే వీరి వివాహ బంధం తెగిపోయింది.  ఇక ఆ తర్వాత దాదాపు పదేళ్లకు గానూ తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ ని ఆమె వివాహం చేసుకుంది. ఈ వివాహ బంధం మాత్రం ఆమెకు నిలబడింది. అగ్ర హీరోయిన్ గా ఉన్నా సరే ఆమె మాత్రం వ్యక్తిగత జీవితాన్న్ సరిగా చూసుకోలేదు ప్లాన్ చేసుకోలేదు అని అంటూ ఉంటారు. ఆమె చేసుకున్న వివాహాలు అప్పట్లో ఇప్పటికి ఒక సంచలనమే. ఇక ఆమెను శరత్ కుమార్ ని వివాహం చేసుకున్న తర్వాత సినిమా కెరీర్ కి గుడ్ బై చెప్పారు. ఆయనకు రాధిక రెండో భార్య. 

 

1984 లో ఆయన ఛాయా అనే ఆమెను వివాహం చేసుకుని 16 ఏళ్ళ పాటు ఆమె తో కలిసి ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు రావడం తో ఆమెకు దూరం అయ్యారు. ఇక అప్పటి నుంచి రాధిక కు దగ్గర కావడం ఆమెను వివాహం చేసుకోవడం జరిగాయి. రాధిక కోసమే ఆయన దూరం అయ్యారని అంటారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ బంధం ఇప్పుడు నిలబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: