మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా చేసిన 'లూసిఫర్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్య భరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. దాంతో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో రీమేక్ హక్కులను రామ్ చరణ్ దక్కించుకున్నాడు. తెలుగు రీమేక్ దర్శకత్వ బాధ్యతలను 'సాహో' దర్శకుడు సుజీత్ కి అప్పగించారు చిరు. ఇప్పటికే తెలుగు వర్షన్‌లో మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తున్నాడట సుజీత్. 'లూసిఫర్' ఓ పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. ఆ చిత్రంలో ఆయనది మిడిల్ ఏజ్ మెన్ రోల్. అలాగే ఆ పాత్రకు హీరోయిన్ కూడా ఉండదు. మరి అదే రోల్ ఇక్కడ చిరంజీవి చేస్తుండగా ఆయన పక్కన హీరోయిన్ లేకుండా మూవీ వర్క్ అవుట్ అవుతుందా అనే ఆలోచన వస్తుంది.

 

స్టోరీ ఎలా ఉన్నా చిరంజీవి హీరో కాబట్టి హీరోయిన్ పెట్టాల్సిన అవసరం ఉంది. మెగాస్టార్ పక్కన అమ్మడు ఉండి లెట్స్ డు కుమ్ముడు అంటేనే మన ఆడియన్స్ కి కిక్ వస్తుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా చిరూకి జోడీని సెట్ చేయాలనే అభిప్రాయంతో వున్నారని అంటున్నారు. అలా కుదరకపోతే చిరుకి హీరోయిన్ లేకుండా ఐటమ్ సాంగ్స్ తో కొంత మేర ఆ లోటు పూడ్చే ఆలోచనలో సుజీత్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే కొన్ని కీలకమైన సన్నివేశాల్లోను మార్పులు చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకు తగినట్టుగానే స్క్రిప్టు లో సుజీత్ మార్పులు చేస్తున్నాడట. తను చేసిన మార్పులు త్వరలో చిరంజీవికి వినిపిస్తాడట. ఓకే అనుకుంటే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయని సమాచారం. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించనున్నాడు. 'ఆచార్య' మూవీ చిత్రీకరణ పూర్తి కాగానే చిరంజీవి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: