ఇండియన్ సినిమాలో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు కమల్ హాసన్. ఆయన నటనకు ఇండియన్ సినిమా మొత్తం ఫిదా అయిపోయింది. విలక్షణ నటుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక వ్యక్తిగత జీవితంలో ఆయనకు వివాదాలు కూడా అప్పట్లో చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పటికి ఆయన ఎక్కువగా వివాదాలతో సావాసం చేస్తూ ఉంటారని అంటారు. ప్రస్తుత౦ ఆయన ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినా కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. 

 

ఇది ఇలా ఉంటే ఆయన జీవితంలో కొన్ని విషయాలను ప్రత్యేకంగా చెప్పుకోవాలని అంటారు. అవి ఏంటీ అంటే ఆయన ప్రేమ కథ. ముందు ఇద్దరినీ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన ఇద్దరికీ దూరం అయ్యారు. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా ఇద్దరికీ ఆయన దూరం అయ్యారు. ముందు వాణి గణపతి ని ఆయన వివాహ చేసుకున్నారు. దాదాపు పదేళ్ళ పాటు వీరు ఇద్దరు కలిసి జీవించారు. ఆ తర్వాత అదే ఏడాది సారిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కమల్. ఈ వివాహం కూడా ఎక్కువ కాలం ఉండలేదు. 16 ఏళ్ళ తర్వాత ఇద్దరు విడిపోయారు. 

 

ఇక అక్కడి నుంచి ఆయన నటి గౌతమి తో కలిసి జీవించారు. వివాహ బంధానికి దూరమైన ఆయన సహజీవనం వైపు అడుగులు వేసి ఆమెకు దగ్గరయ్యారు. అప్పటి నుంచి దాదాపు 12 ఏళ్ళ పాటు ఆయన ఆమెతో కలిసి జీవించారు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా సరే కొన్ని కారణాలతో ఆ వివాహం ఆగిపోయింది అప్పట్లో. వీరి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. వీరి బంధం చాలా మందికి తమిళ పరిశ్రమలో నచ్చలేదు. అయినా సరే ఇద్దరూ మాత్రం ఒకరికి ఒకరు దూరం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: