పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఆయన సినిమాల వసూళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతెందుకు పవర్ స్టార్ సినిమా ప్లాప్ అయినా మొదటి రెండు రోజుల వసూళ్ళలో కూడా రికార్డులు కొడుతోంది. టీజర్ నుండి సినిమా హిట్ అయితే కలక్షన్స్ దాకా పవర్ స్టార్ రేంజ్ ఏంటో తెలిసిందే. అయితే ఒక హీరోకి ప్లాప్ పడితే ఆ తర్వాత సినిమా హిట్టు కొట్టాల్సిందే.. అదే వరుసగా ప్లాపులు వస్తుంటే చిన్నగా ఆ హీరో క్రేజ్ కూడా తగ్గుతుంది. కానీ పవర్ స్టార్ కు మాత్రం అలా కాదు హిట్టు కొట్టినా కొట్టకపోయినా క్రేజ్ మాత్రం అలానే ఉంటుంది.. ఉంది. 

 

2001లో వచ్చిన ఖుషి సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో మరోసారి పవర్ స్టార్ సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ అయింది. ఇక ఆ సినిమా తర్వాత సరిగ్గా 11 ఏళ్ళు 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ వరకు పవర్ స్టార్ తన స్థాయికి తగిన హిట్టు కొట్టలేదు. 2008లో జల్సా సినిమా వచ్చి పర్వాలేదు అనిపించినా ఎందుకో ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ మరోసారి పవర్ స్టార్ అంటే ఏంటో చూపించింది. బాలీవుడ్ దబాంగ్ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. పవర్ స్టార్ అభిమానిగా హరీష్ శంకర్ ఆ సినిమాలో పవన్ ను చూపించిన తీరుకి ఫ్యాన్స్ అంతా ఆ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. 

 

ఖుషి టూ గబ్బర్ సింగ్ మధ్యలో 11 ఏళ్ళు పది సినిమాలు చేసి నిరాశపరచినా పవన్ మీద ఉన్న ఫ్యాన్స్ అభిమానం ఇసుమంతైనా తగ్గలేదనిన్ చెప్పాలి. గబ్బర్ సింగ్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పవర్ స్టార్ ఆ వెంటనే అత్తారింటికి దారేది సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు ఆ సినిమా ఫస్ట్ హాఫ్ లీక్ అయినా కూడా సినిమా సూపర్ హిట్ అవడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: