అప్పట్లో తమిళ సినీ రంగాన్ని ఓ ఊపు ఊపిన జెమినీ గణేషన్ కాలక్రమేణా తెలుగు సినిమాల్లో కూడా నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇతని అసలు పేరు రామస్వామి గణేషన్ కాగా... అందరూ ఇతనిని 'ది కింగ్ అఫ్ రొమాన్స్' అని అంటుంటారు. ఐదు దశాబ్దాల తన సినీ కెరీర్ లో 200కు పైగా చిత్రాలలో నటించారు. అయితే తాను ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం వలన ఎన్నో విమర్శలకు గురయ్యాడు.


జెమినీ గణేష్ తన 19 ఏళ్ల వయసులోనే అలమేలు అనే యువతిని పెళ్లాడి నలుగురు ఆడబిడ్డలైన రేవతి, కమల, జయలక్ష్మి, నారాయణి లను ఆమెతో కలసి కన్నాడు. ఆ తర్వాత తన కో యాక్టర్ అయిన మాయాబజార్ ఫేమ్ సావిత్రి ని వివాహమాడాడు. వీరిద్దరి వివాహ బంధం ఫలితంగా ఒక కూతురు ఒక కొడుకు పుట్టారు. అయితే వీరిద్దరి వివాహం కూడా ఎంతో కాలం కొనసాగలేదు. దాంతో ఆమెను వదిలేసిన జెమినీ గణేషన్ పుష్పవల్లి అనే ఓ యువతిని వివాహమాడాడు. వీళ్లిద్దరి సంసారం లో మళ్ళీ రేఖ, రాధా అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు.


పెళ్లి కూడా పెటాకులు అవ్వడంతో... 1998వ సంవత్సరంలో ఏకంగా తన నాలుగవ పెళ్లిని తన ఆ 76 వ సంవత్సరంలో చేసుకొని అందరి విమర్శలకు బాధితుడు అయ్యాడు. తన 76వ సంవత్సరం లో 36 ఏళ్ళ వయసు ఉన్న జూలియానా ఆండ్రూస్ ని జెమినీ గణేషన్ వివాహమాడి అబాసుపాలయ్యాడు. తన మొత్తం జీవితంలో నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని ఏడుగురు అమ్మాయిలను, ఒక కొడుకులకు తండ్రి అయ్యాడు. ఈ నలుగురి భార్యలలో జెమినీ గణేషన్ తో చివరివరకు ఉన్నది తన మొదటి భార్య అలమేలు మాత్రమే. నిజానికి సావిత్రి చనిపోయినప్పుడు తన బిడ్డల బాగోగులను చూసుకున్నది కూడా అలమేలు అనే చెబుతారు. జెమినీ గణేషన్ పెళ్లిళ్లు చేసుకుంటూ పోతుంటే తాను కట్టుకున్న భార్య లు, కన్న బిడ్డల పరిస్థితి ఘోరంగా తయారైంది అని చాలామంది చెబుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: