తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ హీరో గా ఉంటాడు వెంకటేష్. కుటుంబంలోని ఎమోషన్స్ ని బాగా పండించడంలో వెంకటేష్ కు ఎవరూ సాటి లేరు అని చెప్పారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఇక వెంకటేష్ కెరీర్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మైలురాళ్లు లాంటి సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో సంచలన విజయాలు సొంతం తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. శతాబ్దాలు గడిచి పోతుంది అప్పటికీ వెంకటేష్ ఇప్పటికీ తన ప్రస్థానం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 

 

 

 అయితే ఇప్పటికే ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించిన వెంకటేష్ తన నటనతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ సెంటిమెంట్ ను పంపించాలన్న కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బ నవ్వించాలన్న అది వెంకటేష్ కు మాత్రమే సాధ్యం అని చెప్పాలి. అయితే వెంకటేష్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమాలు  చాలా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ సినిమా టైటిల్ తోనే ఎంతోమందికి కనెక్ట్ అయిపోయింది. ఇక ఈ సినిమా స్టోరీ అయితే యూత్ అందరినీ ఎంతగానో ఆకర్షించింది అని చెప్పాలి. రియలిస్టిక్ యూత్ జీవితానికి ఎంతో దగ్గరగా ఉండే ఈ సినిమా స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 

 

 

 అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ తాను హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సృష్టించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా మరో రెండు రోజుల్లో 13 వ సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది   అందరూ రెడీగా ఉండండి అంటూ వెంకటేష్ తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశారు. టుడేస్ టు గో....  గెట్ రెడీ ఫర్  ట్రెండ్  ఆఫ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటూ వెంకటేష్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: