8 నంది పురస్కారాలను అందుకున్న ప్రముఖ టాలీవుడ్ నటుడు శరత్ బాబు తెలుగు, కన్నడ మలయాళం తమిళ హిందీ భాషలలో 220 పైగా నటించాడు. తన కెరీర్ మొదటి లో శరత్ బాబు రమాప్రభ చాలా సన్నిహితంగా మెలిగేవారట. కాలక్రమేణా వాళ్ళిద్దరు భార్య భర్తల రిలేషన్ షిప్ లోకి అడుగు పెట్టి దాదాపు ఏడు సంవత్సరాల(1981-1988) పాటు కలిసే ఉన్నారట. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోయారు.


రెండు ఏళ్ళు గడిచిన తర్వాత శరత్ బాబు స్నేహలత దీక్షిత్ ని 1990 మే 28వ తేదీన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. 26 ఏళ్ల తర్వాత అనగా 2016 సంవత్సరంలో శరత్ బాబు పెట్టే వేదనలకు తట్టుకోలేక స్నేహలత దీక్షిత్ అతనికి విడాకులు ఇచ్చేసింది. అయితే శరత్ బాబుకు స్నేహలతా తో విడాకులు అయిన తర్వాత కూడా తన అరవై ఏళ్ళ వయసులో వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేశాడు. ప్రస్తుతం అతనికి 68 సంవత్సరాలు కాగా... ఇప్పటికి తాను వంటరి జీవితాన్నే గడుపుతున్నాడు.


రమాప్రభ కు శరత్ బాబు కు మధ్య ఎన్నోసార్లు మాటల యుద్ధం జరిగింది. తనకు శరత్ బాబు ఆసరాగా ఉంటాడని మ్యారేజ్ చేసుకున్నానని కానీ ఆయన మాత్రం కేవలం అవసరానికి మాత్రమే తనని వాడుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. తన వ్యవసాయ పొలాన్ని అమ్మి 60 లక్షలు పెట్టి చెన్నైలోని ఉమాపతి వీధిలో రమాప్రభ కోసం ఒక ఇంటిని కొన్నానని, ఇంకో లక్ష రూపాయలు పెట్టి రెన్నొవేషన్ వర్క్స్ కూడా తానే చేయించానని చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే తాను రమాప్రభ విడిపోయారో... ఆ రోజే చెన్నైలో తాను కొనిచ్చిన ఇంటిని తానే తీసుకున్నానని తెలిపాడు. ఏది ఏమైనా రమాప్రభ శరత్ బాబు కంటే వయసులో దాదాపు అయిదు ఏళ్ళు పెద్ద అని వారిరువురు అనేక సందర్భాల్లో చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: