మెహ్రీన్ కౌర్... పరిచయం అవసరం లేని పేరు. ఈ పంజాబి ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా `కృష్ణ గాడి వీర ప్రేమా గాధ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్.. అందం, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో నటించిన మెహ్రీన్.. యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. మరిన్ని ఛాన్సులు పట్టేయడం ఖాయమని అప్పుడే అంతా అనుకున్నారు.
అయితే కొంత గ్యాప్ వచ్చినా.. ఇప్పుడు మెహ్రీన్ వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కానీ, ఈమె నటించిన అన్ని సినిమాలు పెద్దగా క్లీక్ అవ్వకపోవడంతో మెహ్రీన్ జోరు బాగా తగ్గిపోయింది. అలాంటి టైమ్‌లో విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కలిసి నటించి ఎఫ్ 2 సినిమాలో మెహ్రీన్ హనీ పాత్రలో నటించడమే కాకుండా.. సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘చాణక్య’ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈమె.
కానీ, ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ బ్యూటి తెలుగు సహా తమిళ చిత్రాల్లో నటించి హీరోయిన్గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఈ ఏడాది తెలుగులో ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’.. తమిళంలో ‘పటాస్’ చిత్రాల్లో నటించింది మెహ్రీన్. ఈ అమ్మడు ఇప్పుడు కెరీర్ పరంగా కొత్త టర్న్ తీసుకుంటుందని సినీ వర్గాల టాక్. ఇక ప్రస్తుతం కరోనా కారణంగా దేశమంతటా లాక్డౌన్ అయిన సంగతి తెలిసిందే. నిత్యవసర వస్తువులు మినహా అన్ని సంస్థలు మూతపడ్డారు. దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు.
మరోవైపు, షూటింగ్ లేక సీనితారలు కూడా ఇంటిపట్టునే ఉంటున్నారు. అయితే ఈ లాక్డౌన్ టైమ్‌లో ఎవరికి తోచిన పని వారు చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే హాట్ హాట్ ఫోటోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ఇక తాజాగా మెహ్రీన్ కూడా కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. ఈ ఫోటోస్‌లో రెడ్ డ్రెస్‌లో కనిపిస్తున్న మెహ్రీన్ ను చూస్తుంటే నిజంగా మతిపోవాల్సిందే. మరి ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేసేయండి.