కన్నడ చలన చిత్ర పరిశ్రమలో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రభంజనం సృష్టించిన నటుడు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. అప్పటి మైసూరు ప్రావిన్సులో గల గజనూరులో 1929 ఏప్రిల్ 24న ఆయన జన్మించారు. ఆయన పూర్తి పేరు సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు. అభిమానులు ముద్దుగా ఆయనను డాక్టర్. రాజ్ లేదా అన్నావ్రు ని పిలుచుకునే వారు, అన్నావ్రు అంటే మన భాషలో అన్న గారు అని అర్ధం. ఆయన తండ్రి సింగనల్లూరు పుట్టస్వామయ్య రంగస్థల నటుడు, తల్లి లక్ష్మమ్మ ఇంటి పనులు చూసుకునేవారు. పెద్దకొడుకు కావడంతో ఆయనకు హనుమంతుని పేరుగా పిలవబడే ముత్తురాయుని పేరు కలిసి వచ్చేలా ఆయనకు ముత్తురాజు అని పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుండి సినిమాల మీద ఎంతో మోజు గల రాజ్ కుమార్, తన ఎనిమిదవ తరగతి విద్యను వదిలేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 

IHG

అక్కడి నుండి మెల్లగా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు ప్రారంభించిన రాజ్ కుమార్, తన 25వ ఏట వరకు అక్కడక్కడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడం జరిగింది. కాగా మొట్టమొదట 1952లో వచ్చిన శ్రీశ్రీనివాస కల్యాణ సినిమాలో చిన్న పాత్రలో కనిపంచిన రాజ్ కుమార్, ఆ తరువాత 1954లో వచ్చిన బెదర కన్నప్ప సినిమా ద్వారా పూర్తి స్థాయి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాగా దాని అసలు మాతృకగా తెలుగు సినిమా శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అప్పటికే తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇక కన్నడనాట బెదర కన్నప్ప కూడా మంచి సక్సె స్ కావడంతో నటుడిగా రాజ్ కుమార్ మంచిప పేరు దక్కించుకున్నారు. అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగి, ఒక్కో సినిమాతో తన అద్బుతమైన నటనతో ఎంతో గొప్ప పేరుని, ఎందరో అభిమాన గణాన్ని సంపాదించుకున్న రాజ్ కుమార్ కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలున్నప్పటికీ, బంగారద మనుష్య (బంగారు మనిషి), కస్తూరి నివాస, గంధద గుడి, జీవన చైత్ర ఆయనకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టాయి. 

IHG

ఇక సినిమా రంగంలో కేవలం నటుడిగానే కాక, ఆ తరువాత తన సినిమాలతో పాటు పలువురు ఇతర నటుల సినిమాలకు కూడా తన గాత్రాన్ని అందించి పాటలు ఆలపించిన రాజ్ కుమార్, గాయకుడిగా కూడ విశేషమైన పేరు దక్కించుకున్నారు. 1954 నుంచి 2006 వరకు మొత్తంగా తన కెరీర్ లో 206 సినిమాలతో కన్నడ సినిమాను శ్వాసించి శాసించిన మహా నటుడు రాజ్ కుమార్. తన స్వంత సంస్థలైన వజ్రేశ్వరి కంబైన్స్, దాక్షాయణి కంబైన్స్ బ్యానర్ల పై 100వ సినిమా భాగ్యదా బాగీలు, అలానే 200వ సినిమా దేవతా మనుష్య సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు రాజ్ కుమార్. 1953లో పార్వతమ్మను వివాహం చేసుకున్నారు రాజ్ కుమార్, కాగా వారికి మొత్తం ఐదుగురు సంతానం. ప్రేక్షకుల రివార్డులతో పాటు పద్మ భూషణ్, కర్ణాటక రత్న, దాదా సాహెబ్ ఫాల్కే, కెంటకీ కల్నేల్ అవార్డు తదితర ఎన్నో గొప్ప అవార్డులను అందుకున్న రాజ్ కుమార్, 2000వ సంవత్సరంలో స్మగ్లర్ వీరప్పన్ చెరలో చిక్కి మొత్తంగా 108 రోజుల పాటు అతడివద్ద బందీగా ఉన్నారు. ఆపై కొన్నాళ్ల తరువాత 2006, ఏప్రిల్ 12న రాజ్ కుమార్ మనల్ని అందరినీ విడిచి అనంతలోకాలకేగారు. కాగా నేడు ఆయన 91వ జయంతి కావడంతో పలువురు అభిమానులు, ప్రేక్షకులు ఆయనను స్మరించుకుంటున్నారు....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: