పైన ఉన్న ఫోటోలో ఉన్న ఆవిడ ఎవరో గుర్తుపట్టారా...? ఈవిడ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించింది అంటే మీరు నమ్ముతారా...? అవునండి బాబు నిజమే. ఈవిడ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాలకు హీరోయిన్ గా నటించింది. ఇంతకీ ఈమె ఎవరు అనేగా మీ ఆలోచన..! ఇక విషయంలోకి వెళితే ఈమె పేరు లారిస్సా బొనెసి. ఈమె బ్రెజిలియన్ మోడల్, మొదట్లో బాలీవుడ్ అవకాశాల వేటలో ఉన్నప్పుడు మన తెలుగు దర్శక, నిర్మాతలు ఏరికోరి ఆమెను తీసుకు వచ్చారు.


అయితే ఆమె ఏ సినిమాలో చేసింది అనే కదా మీ అనుమానం... హా అదే లేండి ఆ విషయానికే వెళ్దాం... ఈమె మొదటి సినిమా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం "తిక్క ". నిజం మీరు విన్నది సినిమా పేరు "తిక్క" . ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అనుకుంటున్నారా...? 2016 సంవత్సరంలో రిలీజ్ అయింది. అయితే మీరు ఎక్కువగా చూసుండకపోవచ్చు. దీనికి కారణం థియేటర్లలో కూడా రెండు మూడు రోజుల్లో ఈ సినిమాని తీసేసారు కాబట్టి. ఎందుకంటే ఈ సినిమా అంత ఘోరంగా ఫ్లాప్ అయింది కాబట్టి. సాయి ధరమ్ తేజ్ తను ఏ ఇంటర్వ్యూలో అయినా సరే ఏ సినిమా గురించి ఎన్ని గంటలు గంటలు మాట్లాడుతాడు కానీ తిక్క సినిమా విషయం గురించి అస్సలు మాట్లాడు. దీనికి కారణం దాని ప్లాప్ లెవెల్. 


ఇక ఇంత గొప్ప చిత్రంలో నటించింది లారిస్సా. మామూలుగా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ వచ్చిందంటే తర్వాత సినిమాలకు రెడీ అయిపోతారు నిర్మాతలు బుక్ చేసుకోవడానికి. అయితే 2018 సంవత్సరంలో విడుదలైన నెక్స్ట్ ఏంటి..? సినిమాలో కూడా నటించింది ఈ బ్యూటీ. ఇక అంతే ఆ సినిమా రిజల్ట్ కూడా ఏ మాత్రం మార్పులేదు. దీనితో మరోమారు తెలుగు ఇండస్ట్రీలో కనపడకుండా అయిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇంకో విషయం అంది తిక్క సినిమాను అప్పుతో మా టీవీ కొనుకుందంటా, అయితే అది అప్పట్లో టెలికాస్ట్ చేయలేక ఇప్పుడు చేస్తున్నారంట త్వరలో కాబట్టి ఎవరైనా చూడని వారుంటే చూసేయండి అలా ...!

మరింత సమాచారం తెలుసుకోండి: