టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా పరిచయం అయ్యారు.  ఈ నేపథ్యంలో నిర్మాతలు, దర్శకుల తనయులు కూడా హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  అందులో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు.  దాసరి లాంటి గొప్ప తనయుడు దాసరి అరుణ్ హీరోగా పరిచయం అయినా కెరీర్ పరంగా మంచి సక్సెస్ లేక సైడ్ అయ్యారు.  అయితే ఒకప్పుడు జంద్యాల తర్వాత ఆ స్థాయిలో తనదైన కామెడీ మార్క్ చాటుకున్నారు ఈవీవీ సత్యనారాయణ.  సెంటిమెంట్, ఫ్యామిలీ, రొమాన్స్ మూవీస్ తోపాటు పొట్ట చెక్కలయ్యే కామెడీ సినిమాలు తీశారు.  ఆయన తనయులు ఆర్యన్ రాజేష్ హీరోగా పరిచయం అయ్యాడు.. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.  

 

ఇక డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో అల్లరి  మూవీతో పరిచయం అయ్యాడు నరేష్.  ఈ మూవీ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని అల్లరి నరేష్ అయ్యాడు.  రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ ల తర్వాత అల్లరి నరేష్ కామెడీ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు.  సుడిగాడు సినిమా తర్వాత ఈ అల్లరోడికి ఒక్క హిట్ కూడా పడటం లేదు.  ఆయన చేసిన 'బంగారు బుల్లోడు' ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. ఇక 'నాంది' మూవీ ఇంకా చిత్రీకరణను పూర్తి చేసుకోవలసి వుంది.  

 

దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ విధించారు.  లాక్ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగు తిరిగి మొదలుకానుంది. 'నాంది' మూవీ నా కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను.  ఈ సినిమా నాకు తప్పకుండా మంచి హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. హీరోగా మళ్లీ నేను బిజీ అవుతాననే నమ్మకం ఏర్పడింది. అయితే అల్లరి నరేష్ ఈ కథపై గట్టి నమ్మకమే ఉందంటున్నాడు.  ఈ మూవీ పై మనోడు చాలా ఆశలు పెట్టున్నట్లు కనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: