బాలీవుడ్ పరిశ్రమలో పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ధూమ్ 3 యాక్టర్ ఆమీర్ ఖాన్ కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆయన ఇంగ్లీష్ మూవీ ఫారెస్ట్ గంప్(1994) యొక్క హిందీ రీమేక్ లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలో నటిస్తున్నాడు. ఒరిజినల్ ఇంగ్లీష్ సినిమాలో టామ్ హ్యాంక్ ఫారెస్ట్ గంప్ చిత్రంలో అమాయకత్వం తో కూడిన నిజాయితీ గల బ్రిలియంట్ వ్యక్తి పాత్ర లో సూపర్ గా నటించి ప్రపంచవ్యాప్తంగా సినీ విమర్శకుల చేత ప్రశంసలు పొందాడు. అయితే ఇదే పాత్రలో ఆమీర్ ఖాన్ అందరినీ మెప్పించే విధంగా నటిస్తున్నాడా నటించలేడా అనే అంశం ఆసక్తికరంగా మారింది.


ఇకపోతే, ఆమిర్ ఖాన్ జీవితం ఎప్పుడూ ప్రేమ, ఆప్యాయత లతో కొనసాగుతుందని అందరూ అంటుంటారు. ఎందుకంటే ఆమిర్ ఖాన్ ని మొదటిగా పెళ్లి చేసుకున్న రీనా దత్త ని అతడిని ఎంతగానో ప్రేమగా చూసుకుంది. కానీ విధి వక్రీకరించి 2002వ సంవత్సరంలో వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీనా దత్త తో విడాకులు అయిన తర్వాత కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిన ఆమీర్ ఖాన్ కాలం గడిచే కొద్దీ కిరణ్ రావు తో మాట్లాడడం ప్రారంభించాడు. 2001వ సంవత్సరంలో లగాన్ సినిమా చిత్రీకరణ లో పాల్గొంటున్నప్పుడు ఆ చిత్రం యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావు తో ఆమీర్ ఖాన్ కి పరిచయం ఏర్పడింది.


ఐతే ఆమీర్ కి విడాకులు అయిన అనంతరం కొద్దిరోజుల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో 2005వ సంవత్సరంలో ఆమిర్ ఖాన్ కిరణ్ రావు ఇద్దరూ కలసి పెళ్లి చేసుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు వారి వివాహ జీవితం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతుంది. వీరి వివాహబంధంలో ఓ పండంటి కుమారుడు కూడా జన్మించాడు. అతని పేరు ఆజాద్ రావు ఖాన్. తన కొడుకు అంటే కిరణ్ రావు కు తనకు అత్యంత ప్రేమ అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: