సినీ రంగంలో సంచలనం రేకెత్తించిన అతి కొద్ది సినిమాల్లో ‘భారతీయుడు’ ఒకటి.  1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ సినిమా అప్పట్లో దేశంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.  కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు. లంచగొండితనపై ఓ స్వాతంత్ర యోధుడు పోరాటం ఎలాంటిదో.. చివరకు తన కన్న కొడుకును ఎలా చంపాడు అన్న విషయంపై ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ సీక్వెల్ కి ప్లాన్ చేశారు.. ‘ఇండియన్2’ మూవీ మేకింగ్ జరుగుతుంది.

 

 

ఇది మొదలైప్పటి నుంచి అన్నీ అరిష్టాలే జరుగుతున్నాయి. కొద్ది కాలం షూటింగ్ అగింది.. మేకప్ విషయంలో కాంట్రవర్సీ నెలకొంది.. అన్నీ ఓకే అనుకున్న సమయంలో  సినిమా సెట్లో  మూడు రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఈ ప్రమాదంపై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు శారు. నిర్మాతలు, క్రేన్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్‌పై కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్‌కు సమన్లు జారీ చేశారు.

 

 

తాజాగా మరోసారి డైరెక్టర్ శంకర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను శంకర్ .. బాబీసింహాను తీసుకున్నాడు. కాల్షీట్స్ ప్రకారం పనిచేసే బాబీ సింహాకి ఇంతవరకూ 6 కోట్లు ముట్టజెప్పారట. ఆయనపై చిత్రీకరించవలసిన సన్నివేశాలకిగాను మరో 4 కోట్లను చెల్లించవలసి వుంటుందట. ఈ విషయంలో  శంకర్ బడ్జెట్ పెంచేశాడనే అభిప్రాయంతో వున్న నిర్మాతలు, ఆయన పట్ల అసహనంతో ఉన్నారని అంటున్నారు. మరి ఈ విషయంలో బాబి సింహాను శంకర్ ఎలా ఒప్పించి బడ్జెట్ లో కోత విధిస్తాడో చూడాలి.   మొత్తానికి ఈ మూవీ అయ్యేంత వరకు ఎన్ని వార్తలు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: